నిరుద్యోగులకు శుభవార్త.. వచ్చే ఏడాది భారీగా ఉద్యోగ నియామకాలు

ప్రతీకాత్మక చిత్రం

Monster Employment Report 2020: ప్రస్తుతం అన్ లాక్ నేపథ్యంలో మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని తాజా నివేదిక తెలిపింది.

 • Share this:
  కరోనా దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. అనేక మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ సమయంలో కొత్త నియామకాలు అసలు జరగలేదు. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ప్రస్తుతం అన్ లాక్ నేపథ్యంలో మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని తాజా నివేదిక తెలిపింది. అయితే కరోనా దెబ్బకు గతేడాది కంటే 6 శాతం నియామకాలు తగ్గాయని నివేదిక వెల్లడించింది. ఈ మేరకు Monster Employment Report 2020 వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మొదటి త్రైమార్షికంలో గతేడాదికంటే 9 శాతం కన్నా అధికంగా నియామకాలు జరిగాయని తేలింది. అయితే కరోనా నేపథ్యంలో నియామకాలు తగ్గడంతో ఈ ఏడాది చివరి నాటికి ఆ గతేడాదితో పోల్చితే నియామకాలు 6 శాతం తగ్గినట్లుగా నమోదైంది.

  అయితే గత కొన్ని నెలలుగా నియామకాలు మళ్లీ పెరిగాయి. దీంతో రానున్న కొత్త ఏడాది 2021లో మంచి ఉద్యోగవకాశాలు ఉంటాయని నివేదిక వెల్లడించింది. కరోనా విజృంభించిన సమయం ఏప్రిల్-జూలై మధ్యలో బీపీఓ, ఐటీఈఎస్ ఉద్యోగాలు 48 శాతం తగ్గాయని పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో సైతం 48 శాతం తగ్గాని తెలిపింది. ప్రొడక్షన్, మానుఫాక్చరింగ్ రంగాల్లో 46 శాతం, ట్రావెల్ మరియూ టూరిజం రంగాల్లో 76 శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించింది.

  ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో అన్ని రంగాల్లో నియమకాల్లో పెరుగుదల నమోదైందన్నారు. ఫైనాన్స్, అకౌంట్స్, సీనియర్ మేనేజ్మెంట్, హాస్పటాలిటీ, ట్రావెల్, హెచ్ఆర్ అండ్ అడ్మిన్ తదితర రంగాలు కరోనాతో బాగా దెబ్బతిన్నాయన్నారు. లాక్ డౌన్ అనంతరం ఇవి కోలుకోవడం చాలెంచ్ తో కూడుకున్నదని వారు నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం తమ సైట్ లో అభ్యర్థులు, సంస్థల యాక్టివిటీస్ పెరిగాయని Monster తెలిపింది. దీనిని బట్టి వచ్చే ఏడాది ఉద్యోగవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.
  Published by:Nikhil Kumar S
  First published: