Home /News /jobs /

JOB ORIENTED FREE TRAINING BY NSDC AND SAMSUNG INDIA EVK

50,000 మందికి ఉచిత‌ శిక్ష‌ణ‌.. ఉపాధి

(ప్రతీకాత్మ చిత్రం)

(ప్రతీకాత్మ చిత్రం)

శామ్‌సంగ్ ఇండియా, ఎన్‌ఎస్‌డీసీ భాగ‌స్వామ్యంతో ఎలక్ట్రానిక్ రీటైల్ రంగంలో 50,000 మందికి శిక్ష‌ణ అందించ‌నున్నారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థుల‌కు శిక్ష‌ణ‌తోపాటు స్టై ఫండ్ కూడా అందించ‌నున్నారు.

    దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వినియోగంతో రీటైల్ రంగంలో నిపుణుల‌కు మెరుగైన ఉపాధి అవ‌కాశాలు ఉన్నాయి. వాట‌ని అందిపుచ్చుకొనేందుకు యువ‌త‌కు శిక్ష‌ణ అవసరం.  ఈ నేపథ్యంలో..
    ఎల‌క్ట్రానిక్ రీటైల్ రంగంలో 50,000 మంది విద్యార్థుల‌కు శామ్‌సంగ్ ఇండియా భాగ‌స్వామ్యంతో శిక్ష‌ణ అందించనున్న‌ట్లు నేష‌న‌ల్ స్కిల్ డెవెల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్‌ఎస్‌డీసీ) ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఎస్‌డీసీ శిక్ష‌ణ కేంద్రాల ద్వారా ఈ శిక్ష‌ణ అందించ‌నున్న‌ట్లు వారు తెలిపారు. ఈ శిక్ష‌ణ ద్వారా విద్యార్థుల‌కు మార్కెట్‌లో ఎల‌క్ట్రానిక్ రీటైల్ రంగంలో ప‌ని చేసే సామ‌ర్థ్యం, నైపుణ్యం ల‌భిస్తుంది.
    దేశంలోని యువ‌త‌కు మెరుగైన ఉపాధి క‌ల్పించ‌డంలో భాగంగా ఎన్‌ఎస్‌డీసీ 'శామ్‌సంగ్ DOST తో శిక్ష‌ణ ఒప్పందం చేసుకొంది. ఈ కార్య‌క్ర‌మంలో ఆన్‌లైన్ ద్వారా విద్యార్థికి 200 గంట‌ల శిక్ష‌ణ అందించున్నారు. శిక్ష‌ణ పొందుతున్న విద్యార్థుల‌కు స్టైఫండ్ కూడా అందిచ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం దేశంలో వేగంగా పెరుగుతున్న ఎల్ట్రానిక్ వ‌స్తువ‌ల వినియోగం ద్వారా ఎల్ట్రానిక్ రిటైల్ రంగంలో చాలా ఉపాధి అవ‌కాశాలు ఉన్నాయ‌ని శామ్‌సంగ్ తెలిపింది. ఎన్నో ఉపాధి అవ‌కాశాలు ఉన్నా.. నైపుణ్యం ఎంతో అవ‌స‌ర‌మ‌ని అందుకోస‌మే ఉద్యోగార్థుల‌కు మెరుగైన శిక్ష‌ణ అందించి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించనున్న‌ట్లు తెలిపారు.
    ఎన్‌ఎస్‌డీసీ ద్వారా గుర్తింపు పొందిన శిక్ష‌ణా కేంద్రాల్లో శిక్ష‌ణ ఇస్తారు. ఈ శిక్ష‌ణ‌లో నైపుణ్య అభివృద్ధితోపాటు ప‌రిశ్ర‌మ అవ‌ర‌సాల‌కు త‌గ్గ‌ట్టు శిక్ష‌ణ ఇస్తారు. వినియోగ‌దారుల‌తో మాట్లాడం.. సేల్స్ మేనేజ్‌మెంట్‌, వినియోగ‌దారుల ప్ర‌శ్న‌లు, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే సామ‌ర్థ్యం వారికి అందించ‌నున్నారు. కమ్యూనికేష‌న్ స్కిల్స్‌, సాఫ్ట్ స్కిల్స్‌లో నైపుణ్యం పొందేలా శిక్ష‌ణ అందించ‌నున్నారు. అంతే కాకుండా కోవిడ్ నిబంధ‌న‌లు, మ‌ర్యాద‌లు పాటించేలా త‌ర్ఫిదునిస్తారు.
    శిక్ష‌ణ స‌మ‌యంలో రోల్‌ప్లే టెక్నిక్స్‌, హ్యాండ్‌-ఆన్ ట్రైనింగ్ ద్వారా రిటైల్ స్టోర్ల ప‌నితీరుపై మెరుగైన అవ‌గాహన క‌ల్పిస్తారు. పాఠ‌శాల విద్యపూర్తి చేసిన యువ‌త‌కు ఈ శిక్ష‌ణ అందించ‌నున్నారు. శిక్ష‌ణ పూర్తి చేసుకొన్న విద్యార్థుల‌కు టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (TSSC) ద్వారా ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందించ‌నున్నారు. దేశ వ్యాప్తంగా NSDC గుర్తించిన 120 కేంద్రాల్లో ఈ శిక్ష‌ణ ల‌భించ‌నుంద‌ని తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: JOBS, Samsung

    తదుపరి వార్తలు