హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Opportunity: పండుగ సీజన్లో ఉద్యోగాల జాతర.. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనున్న సంస్థలు..

Job Opportunity: పండుగ సీజన్లో ఉద్యోగాల జాతర.. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనున్న సంస్థలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Job Opportunity: నిరుద్యోగులకు ఈ కామర్స్ సంస్థలు శుభవార్తను తీసుకొచ్చాయి. పెద్ద సంఖ్యలో డెలివరీ వర్కర్ల కోసం వెతుకుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నిరుద్యోగులకు ఈ కామర్స్(E Commerce) సంస్థలు శుభవార్తను తీసుకొచ్చాయి. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు(Jobs) లభించే అవకాశం ఉంది. పండుగ సీజన్‌లో, దేశంలోని ఇ-కామర్స్ కంపెనీలు పెద్ద సంఖ్యలో డెలివరీ వర్కర్ల(Delivery Workers) కోసం వెతుకుతున్నాయి.టాటా(TATA), బిగ్‌బాస్కెట్(Big Basket) వంటి కంపెనీలు ఈ రిక్రూట్‌మెంట్(Recruitment) ప్రక్రియలో పాల్గొనబోతున్నాయి. ఈ కంపెనీలు ఇంత తొందరపడడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది పండుగల సీజన్ (Festival Season) అండ్ రెండవది నిరుద్యోగ రేటు తగ్గింపు. ఇతర రోజులతో పోలిస్తే పండుగ సీజన్‌లో విక్రయాలు చాలా రెట్లు పెరుగుతాయి. బట్టలు, బూట్లు(Shoes), మొబైల్స్(Mobiles), ఎలక్ట్రానిక్స్(Electronics), కిరాణా సామాగ్రి వంటి వస్తువులు ఎక్కువగా ఆర్డర్(Orders) చేయబడతాయి. ఆర్డర్ల విపరీతంగా ఉండటంతో.. సరుకుల డెలివరీ అనేది ఆలస్యమువుతూ ఉంటుంది. దీని వల్ల కస్టమర్లు(Customers) అసౌకర్యం కారణంగా ఆర్డర్‌లను క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. దీంతో కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి.. కంపెనీలు పండుగ సీజన్‌లో నియామకాలను పెంచుతాయి.


Mega Job Mela: పది, ఇంటర్, డిగ్రీ, పీజీ అభ్యర్థులకు అలర్ట్.. నేడు మెగా జాబ్ మేళా నిర్వహణ.. వివరాలిలా..


ప్రస్తుతం.. ఈ-కామర్స్ కంపెనీలు డెలివరీ సిబ్బందిని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. వచ్చే నెలలో ప్రారంభం కానున్న అతిపెద్ద షాపింగ్ సీజన్ సిబ్బంది కొరతకు దారితీస్తుందని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఆన్‌లైన్ కిరాణా విక్రయదారు బిగ్‌బాస్కెట్ యొక్క CEO TK బాల్‌కుమార్ మాట్లాడుతూ.. గిగ్ వర్క్‌ఫోర్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగింది. టాటా గ్రూప్ తన ఇన్‌స్టంట్ డెలివరీ సెగ్మెంట్ BB Nowలో డెలివరీ భాగస్వాముల సంఖ్యను మార్చి త్రైమాసికంలో 500 నుండి జూన్ త్రైమాసికంలో 2,200కి పెంచింది. మార్చి 2023 నాటికి దీన్ని దాదాపు 6,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.



BigBasket అండ్ ఇ-కామర్స్ సంస్థ డాంజో డెలివరీ వర్కర్ల కోసం వారి సొంత సిబ్బందిని కలిగి ఉన్నాయి. కాబట్టి.. సౌందర్య సాధనాల నుండి ఫ్యాషన్ రిటైలర్ Nykaa వంటి కంపెనీలు సేవలను అందించడానికి ఇతర భాగస్వాములపై ​​ఆధారపడతాయి. NITI ఆయోగ్ జూన్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. డెలివరీ కార్మికులతో కూడిన థింక్ ట్యాంక్, గిగ్ వర్కర్లకు ఉపాధి పెరిగిందని తెలిపింది. ఇది 2022-23 నాటికి భారతదేశంలో 90 లక్షలు దాటుతుందని అంచనా వేసింది. ఈ సంఖ్య 2019-20 కంటే 45 శాతం ఎక్కువ.


Seventy Five Thousand Vacancies: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. Delhiveryలో 75 వేల ఉద్యోగాలు..


భారతదేశ నిరుద్యోగిత రేటు 7 శాతం కంటే తక్కువ..
భారతదేశ నిరుద్యోగిత రేటు జనవరి తర్వాత మొదటిసారిగా జూలైలో 7 శాతం దిగువకు పడిపోయింది. దీని కారణంగా ఈ-కామర్స్ రంగం ముందు ఈ సమస్య పెరుగుతోంది. ఈ రంగంలో ఇప్పటికే కార్మికుల కొరత ఉంది. ఇప్పుడు నిరుద్యోగిత రేటు తగ్గినందున.. వారు మరింత ఇబ్బందులను ఎదుర్కోవాలసి ఉంటుంది.

First published:

Tags: Career and Courses, E-commerce, JOBS, Private Jobs

ఉత్తమ కథలు