Home /News /jobs /

Internship: ఇంట‌ర్న్‌షిప్‌తో కొలువుకు మార్గం సుల‌భం.. అందుబాటులో ప‌లు కోర్సులు

Internship: ఇంట‌ర్న్‌షిప్‌తో కొలువుకు మార్గం సుల‌భం.. అందుబాటులో ప‌లు కోర్సులు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Internship: ప్రస్తుతం పెద్ద‌కంపెనీలు అన్ని కొత్త త‌ర‌హా విధానాన్ని అవ‌లంభిస్తున్నాయి. ఫ్రెష‌ర్స్‌ (Freshers)ను ఎంపిక చేసుకోవ‌డానికి ఇంట‌ర్న్‌షిప్ చేసిన‌వారికి ప్రాధాన్య‌త ఇస్తుంది. బీటెక్ (BTech) చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న వారు ఇంట‌ర్న్‌షిప్ చేస్తే ఎక్కువ ఉపాధి అవ‌కాశాల‌ను (Job Opportunities) అందిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  ప్రస్తుతం పెద్ద‌కంపెనీలు అన్ని కొత్త త‌ర‌హా విధానాన్ని అవ‌లంభిస్తున్నాయి. ఫ్రెష‌ర్స్‌ను ఎంపిక చేసుకోవ‌డానికి ఇంట‌ర్న్‌షిప్ చేసిన‌వారికి ప్రాధాన్య‌త ఇస్తుంది. బీటెక్ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న వారు ఇంట‌ర్న్‌షిప్ చేస్తే ఎక్కువ ఉపాధి అవ‌కాశాల‌ను అందిస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఫ్రెష‌ర్స్‌ని కాకుండా కాస్త ప‌నిపై అనుభ‌వం ఉన్న‌వారికి అవ‌కాశాలు ఇస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్న్‌షిప్ చేసివారైతే ప‌నిపై అవ‌గాహ‌న‌తో పాటు స‌బ్జెక్టుపై ప‌ట్టు ఉంటుంద‌ని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా కంపెనీలు ఇంట‌ర్న్‌షిప్‌ను అందిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఇంట‌ర్న్‌షిప్ వివ‌రాలు తెలుసుకోండి.

  ఆర్‌బీఐలో ఇంట‌ర్న్‌షిప్ ప్రొగ్రాం..


  బ్యాంక‌ర్స్ బ్యాంక్‌ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) విద్యార్థుల‌కు స‌ద‌వ‌కాశం అందిస్తోంది. ఆర్‌బీఐలో విద్యార్థుల‌కు, గ్రాడ్యుయేట్ ఫ్రెష‌ర్ల‌కు వార్షిక వేసవి ఇంటర్న్‌షిప్ (Internship) ప్రోగ్రామ్ ఏప్రిల్ 2022 నుంచి ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఇంట‌ర్న్‌షిప్‌కు ఫైనాన్స్, ఎకనామిక్స్ (Economics), లా, బ్యాంకింగ్‌లలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఇంట‌ర్న్‌షిప్ ప్రొగ్రామ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  BEL Recruitment 2021: "బెల్‌"లో రిసెర్చ్ స్టాఫ్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు,అప్లికేష‌న్ ప్రాసెస్‌


  ఈ స‌మ్మర్ ప్లేస్‌మెంట్స్ కోసం మొత్తం 125 మంది ఇంటర్న్‌లను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000 స్టైఫండ్ అందజేస్తారు. శిక్షణ (Training) పొందినవారు ముంబై (Mubai)కి మరియు తిరిగి వచ్చే ప్రయాణ ఖర్చులను భరించాలి. వారి వసతి ఏర్పాట్లను కూడా వారే స్వయంగా చూసుకోవాలి. ( పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి.. )

  ఐటీ గాంధీనగర్​లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్..


  దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరొందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) గాంధీనగర్ సరికొత్త ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్​ను ప్రారంభించింది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ ఫెసిలిటీ (ISTF)లో ఇంటర్న్​ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 5 లేదా అంతకంటే ముందు ఐఐటీ గాంధీనగర్​ అధికారిక వెబ్‌సైట్ www.iitgn.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఐఎస్​టీఎఫ్​లో వివిధ అంశాలపై శిక్షణనిస్తుంది.

  Bank Exam Preparation: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఏం చ‌ద‌వాలి?


  వీటిలో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC), నెట్‌వర్క్ అండ్​ సిస్టమ్స్ (Network and Systems), సాఫ్ట్‌వేర్ మొదలైన మాడ్యూల్స్​పై అవగాహన కల్పిస్తారు. ఎంపికైన ఇంటర్న్‌లను ప్రాథమికంగా ఆరు నెలల (six months) పాటు నియమించుకుంటారు. వారి పనితీరు ఆధారంగా మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉంది. (పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి.. )

  మైక్రోసాఫ్ట్‌లో వర్చువల్ ఇంటర్న్‌షిప్..


  డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్. ఐటీ రంగ దిగ్గజం అయిన మైక్రోసాఫ్ట్ ఇంటర్‌షిప్స్ ప్రకటించింది. రెండో బ్యాచ్‌లో 85,000 మందికి వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఇస్తోంది. భారతదేశంలో ఇటీవల డిగ్రీ పూర్తి చేసినవారంతా ఈ ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్-ఏ నాస్‌కామ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) డిజిటల్ స్కిల్ ఇనషియేటీవ్, ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ (EY), గిట్‌హబ్, క్వెస్ కార్ప్ లాంటి సంస్థలతో కలిపి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది మైక్రోసాఫ్ట్.   (పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి.. )
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Computer science, EDUCATION, Internship, IT jobs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు