హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in PhonePe : మ్యూచ్‌వ‌ల్ ఫండ్ రంగంలో ఉద్యోగ అవ‌కాశాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌, అర్హ‌త‌లు

Jobs in PhonePe : మ్యూచ్‌వ‌ల్ ఫండ్ రంగంలో ఉద్యోగ అవ‌కాశాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌, అర్హ‌త‌లు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in PhonePe : మ‌్యూచ్‌వ‌ల్ ఫండ్ రంగంలో ఎదిగేందుకు నిరుద్యోగుల‌కు మంచి అవ‌కాశం ల‌భించింది. ప్ర‌ముఖ డిజిట‌ల్ ప్లాట‌ఫాం ఫోన్‌పే మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ (Mutual Fund Specialist) పోస్టులను భ‌ర్తీ చేయంనుంది. ఈ ఉద్యోగానికి కావ‌ల్సిన అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు.

ఇంకా చదవండి ...

భారతదేశం (India) లోని ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే (PhonePe) నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ పోస్టును భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ ప్రోగ్రాం నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థులు మ్యూచువల్ ఫండ్స్‌ (Mutual Funds)కు సంబంధించిన కస్టమర్ల (Customers) సందేహాలను పరిష్కరించాల్సి ఉంటుంది. అంతే కాకుండా వారికి ఫండ్స్‌కు సంబంధించి మెరుగైన అనుభ‌వాన్నిఅందించాల్సిన బాధ్య‌త ఉంటుంది. ఈ జాబ్ రోల్‌ (Job Role) లో ముఖ్యంగా వినియోగ‌దారుల సమస్యలు వేగంగా పరిష్కరించిందేకు కృషి చేయాలి. అందుకు అనుగుణంగా ప్లానింగ్‌ (Planning)ను అందించాలి.

ద‌ర‌ఖాస్తుకు అర్హ‌త‌లు..

- ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థికి 0-2 సంవ‌త్స‌రాల వృత్తి అనుభ‌వం ఉండాలి.

- అద్భుతమైన వ్రాత, మౌఖిక సంభాషణా సామ‌ర్థ్యం అవ‌స‌రం.

IBPS Clerk 2021: ఐబీపీఎస్ క్ల‌ర్క్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. ప‌రీక్ష విధానం


NEET Exam: ఏడాది రెండు సార్ల నీట్‌.. విద్యా, ఆరోగ్యశాఖ యోచ‌న‌


 - వినియోగ‌దారుల స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా వినాలి.

- ప‌నికి సంబంధించిన మేనేజ‌మెంట్ స్కిల్స్ ఉండాలి.


ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 : ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

Step 2 : ముందుగా అభ్య‌ర్థులు www.phonepe.com యొక్క అధికారిక పోర్టల్‌ని సందర్శించాలి.

Step 3 : ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

RRB Group-D: ఆర్ఆర్‌బీ-గ్రూప్‌డీ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. అప్లికేష‌న్‌కు మ‌రో అవ‌కాశం


Step 4 : వెబ్‌సైట్‌లోకి వెళ్ల‌గానే కెరీర్ ట్యాబ్‌లోకి వెళ్లాలి.

Step 5 : అనంత‌రం స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

Step 6 : అభ్య‌ర్థి లింక్డ్‌ఇన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కెరీర్ పేజీలో అందుబాటులో ఉంది.

Step 7 : అవ‌ర‌స‌మైన వివ‌రాల‌ను అందించి సైన్ ఇన్ అవ్వాలి. అనంత‌రం ద‌ర‌ఖాస్తు ఫాంలోని అన్ని ఫీల్డ్‌ల‌ను నింపాలి.

Step 8 : ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత స‌బ్‌మిట్ చేయాలి.

మ‌రిన్ని అవ‌కాశాలు..

అంతే కాకుండా ఫోన్‌పే కంపెనీ సీనియర్ ఆటోమేషన్ స్పెషలిస్ట్ అండ్‌ సోషల్ మీడియా (Auto Machine Specialties and Social Media) నిపుణులను కూడా నియమిస్తోంది. రెండు పోస్టులకు దరఖాస్తులు తెరిచి ఉన్నాయి. ఫ్రెషర్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Phonepeలో, ఐదు పని దినాలు ఉన్నాయి, అయితే, సంస్థ ఏ ఉద్యోగానికి అందించే జీతం వివ‌రాలు పేర్కొన‌లేదు.

ఫోన్‌పే ఈ సంవత్సరం జూన్‌లో ఫీచర్ (Feature) ప్రారంభించినప్పటి నుంచి ఒక మిలియన్ UPI- ఆటోపే ఆదేశాలను నమోదు చేసినట్లు ప్రకటించింది. ఈ మైలురాయిని అందుకొన్న మొద‌టి డిజిటల్ పేమెంట్ (Digital Payment) ప్లాట్‌ఫాంగా గుర్తింపు పొందిన‌ట్టు సంస్థ పేర్కొంది.

First published:

Tags: Freshers, JOBS, Mutual Funds, PhonePe

ఉత్తమ కథలు