హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Opportunities: ఈ ఉద్యోగాల‌కు అప్లై చేశారా..? అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

Job Opportunities: ఈ ఉద్యోగాల‌కు అప్లై చేశారా..? అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Privat Jobs: క‌రోనా త‌రువాత ప‌లు సంస్థ‌లు నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కావాల‌ను క‌ల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం (India) లోని ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే (PhonePe) నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo airlines) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన అప్లికేష‌న్ ప్రాసెస్‌.. ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

  క‌రోనా త‌రువాత ప‌లు సంస్థ‌లు నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కావాల‌ను క‌ల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం (India) లోని ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే (PhonePe) నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ పోస్టును భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ ప్రోగ్రాం నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.  ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo airlines) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ఆధారంగా ట్రైనీ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన అప్లికేష‌న్ ప్రాసెస్‌.. ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకోండి.

  ఫోన్‌పేలో మ్యూచ్‌వ‌ల్ ఫండ్ స్పెష‌లిస్ట్ ఉద్యోగాలు..


  ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ పోస్టును భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ ప్రోగ్రాం నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థులు మ్యూచువల్ ఫండ్స్‌ (Mutual Funds)కు సంబంధించిన కస్టమర్ల (Customers) సందేహాలను పరిష్కరించాల్సి ఉంటుంది. అంతే కాకుండా వారికి ఫండ్స్‌కు సంబంధించి మెరుగైన అనుభ‌వాన్నిఅందించాల్సిన బాధ్య‌త ఉంటుంది. ఈ జాబ్ రోల్‌ (Job Role) లో ముఖ్యంగా వినియోగ‌దారుల సమస్యలు వేగంగా పరిష్కరించిందేకు కృషి చేయాలి. అందుకు అనుగుణంగా ప్లానింగ్‌ (Planning)ను అందించాలి.

   ద‌ర‌ఖాస్తుకు అర్హ‌త‌లు..

  - ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థికి 0-2 సంవ‌త్స‌రాల వృత్తి అనుభ‌వం ఉండాలి.

  - అద్భుతమైన వ్రాత, మౌఖిక సంభాషణా సామ‌ర్థ్యం అవ‌స‌రం.

  - వినియోగ‌దారుల స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా వినాలి.

  - ప‌నికి సంబంధించిన మేనేజ‌మెంట్ స్కిల్స్ ఉండాలి.

  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 : ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

  Step 2 : ముందుగా అభ్య‌ర్థులు www.phonepe.com యొక్క అధికారిక పోర్టల్‌ని సందర్శించాలి.

  Step 3 : ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

  Step 4 : వెబ్‌సైట్‌లోకి వెళ్ల‌గానే కెరీర్ ట్యాబ్‌లోకి వెళ్లాలి.

  Open Book Exam: బుక్ చూసి ప‌రీక్ష‌లు రాయ‌డం ఈజీ కాదు.. ఓపెన్ బుక్ ఎగ్జామ్స్‌ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన ఢిల్లీ యూనివ‌ర్సిటీ


  Step 5 : అనంత‌రం స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

  Step 6 : అభ్య‌ర్థి లింక్డ్‌ఇన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కెరీర్ పేజీలో అందుబాటులో ఉంది.

  Step 7 : అవ‌ర‌స‌మైన వివ‌రాల‌ను అందించి సైన్ ఇన్ అవ్వాలి. అనంత‌రం ద‌ర‌ఖాస్తు ఫాంలోని అన్ని ఫీల్డ్‌ల‌ను నింపాలి.

  Step 8 : ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత స‌బ్‌మిట్ చేయాలి.

  ఇండిగో ఎయిర్​లైన్స్‌లో ట్రైనీ ఉద్యోగాలు


  ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు ఇండిగో రిక్రూట్‌మెంట్‌ (Recruitment) కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ goindigo.app.param.ai ను సంద‌ర్శించాలి. ఈ వెబ్‌లింక్ ద్వారా ప‌లు పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ (Electronics), మెకానికల్ లేదా ఏరోనాటికల్ (Aeronautical) విభాగాల్లో ఇంజ‌నీరింగ్ పూర్తి చేసిన అభ్య‌ర్థుల‌కు మాత్రమే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

  అర్హత ప్రమాణాలు

  ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ ఏరోనాటికల్ విభాగాల్లో బీఈ/ బీటెక్​ పూర్తి చేసి ఉండాలి. పదోతరగతి, ఇంటర్మీడియట్​, బీటెక్​లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.

  ఎంపికైన వారు చేపట్టాల్సిన విధులు..

  - ఇండిగో ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కొన్ని బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..

  -  ఎంపికైన వారు ఎయిర్‌క్రాఫ్ట్ రూటింగ్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్, ఎయిర్​క్రాఫ్ట్ గ్రౌండింగ్ సమయంలో మెయింటెనెన్స్​ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వేర్‌హౌస్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ఫ్రంట్ లైన్ సపోర్ట్ విధులు, విమాన భాగాల మరమ్మతుతో పాటు నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలి.

  CAT 2021 : "క్యాట్‌" క్వాలిఫై అవ్వ‌లేక‌పోతున్నారా..? అయితే ఐఐఎంలో సీట్ పొందేందుకు ఇత‌ర మార్గాలు ఇవే!


  -  మెటీరియల్స్, స్పేర్స్, టూల్స్, ఎక్విప్‌మెంట్ ప్లాన్ అండ్​ ప్రొవిజనింగ్‌తో పాటు విడిభాగాల సేకరణ, లాజిస్టిక్స్ సపోర్ట్​ అందించాలి. ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్, సి-చెక్‌తో సహా దీర్ఘకాలిక ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ బాధ్యతను నిర్వహించాలి. ఇన్సూరెన్స్​, వారంటీ, బడ్జెటింగ్​, కాస్ట్ కంట్రోల్​.

  కాంట్రాక్ట్స్​ మేనేజ్​మెంట్​, లోకల్​ / ఫారన్​ విక్రేతలను అనుసంధానించండం, ప్రత్యేక ప్రాజెక్ట్‌లు / అధ్యయనాలు / సిస్టమ్స్, ప్రొసీజర్లను అమలు చేయడం... వంటి బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: JOBS, PhonePe, Private Jobs

  ఉత్తమ కథలు