JOB OPENINGS JOBS WITH DEGREE QUALIFICATION IN A LEADING AUDIT COMPANY KNOW APPLICATION PROCESS EVK
Job Openings: ప్రముఖ ఆడిట్ కంపెనీలో డిగ్రీ అర్హతతో జాబ్స్.. అప్లికేషన్ ప్రాసెస్
(ప్రతీకాత్మక చిత్రం)
Job Openings | బెంగుళూర్‌లోని ప్రముఖ మల్టీ నేషనల్ ఆడిట్ కంపెనీ ఎర్నెస్ట్ యంగ్ గ్లోబల్ లిమిటెడ్ (EY) సీనియర్ ఫైనాన్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు www.ey.com అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మల్టీ నేషనల్ ఆడిట్ కంపెనీ ఎర్నెస్ట్ & యంగ్ గ్లోబల్ లిమిటెడ్ (EY) బెంగళూరులోని తన కార్యాలయంలో సీనియర్ ఫైనాన్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు www. ey.com అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని నోటిఫికేషన్లో పేర్కొనలేదు. కాబట్టి, అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు(Application) చేసుకోవడం మంచిది. అర్హతల విషయానికి వస్తే.. ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాల్లో బీకామ్ లేదా ఎంకామ్(M com) ఉత్తీర్ణత సాధించిన వారే దరఖాస్తుకు అర్హులు. విద్యార్హతకు అదనంగా, ఫైనాన్స్ రిపోర్టింగ్(Reporting), ఇతర అకౌంటింగ్ ప్రక్రియల్లో 3- నుంచి 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. వీటితో పాటు అభ్యర్థులకు బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్‌లపై నాలెడ్జ్, ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
స్టెప్ 6- తర్వాత, 'క్రియేట్ యాన్ అకౌంట్'ని ఎంచుకోండి. తద్వారా మీ అన్ని వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ, ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లయితే లాగిన్ అవ్వండి.
స్టెప్ 7- రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో అన్ని ప్రాథమిక వివరాలను పూరించండి. మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయండి.
స్టెప్ 8- అవసరమైన వివరాలను అందించడం ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.
స్టెప్ 9- భవిష్యత్ ఉపయోగం కోసం మీ దరఖాస్తు ఫారమ్‌ను సేవ్ చేయండి.
ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ (ఇన్వెంటరీ రిపోర్ట్స్లతో సహా) తయారు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు సంబంధించిన సంక్లిష్టమైన తాత్కాలిక నివేదికలను సకాలంలో నిర్వహించే బాధ్యత కూడా అభ్యర్థికి ఉంటుంది. ఆదాయ ప్రణాళికలో పాల్గొనడం, కొత్త నివేదికలను ప్రిపేర్ చేయడం, ఇప్పటికే ఉన్న నివేదికలను అభివృద్ధి చేయడం, జూనియర్ అనలిస్ట్‌లకు మార్గనిర్దేశం చేయడం, వారికి శిక్షణనివ్వడం వంటి విధులు ఉంటాయి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించడం మంచిది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.