JOB OPENINGS IN INFOSYS INDIA KNOW HOW TO APPLY EVK
Infosys Jobs: ఇన్ఫోసిస్ లో ఉద్యోగాలు.. అప్లె చేసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) దేశవ్యాప్తంగా వివిధ జాబ్ ప్రొఫైల్స్ కోసం ఆన్ లైన్ (Online) అప్లికేషన్లను స్వీకరిస్తోంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ RPA డెవలపర్/కన్సల్టెంట్, ప్రిన్సిపాల్ ఆర్కిటెక్ట్, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్-జావా మైక్రో సర్వీసెస్‌తో సహా అనేక జాబ్ ప్రొఫైల్‌ల కోసం నియామక ప్రక్రియ (Selection Process) ప్రారంభించింది.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) దేశవ్యాప్తంగా వివిధ జాబ్ ప్రొఫైల్స్ కోసం ఆన్ లైన్ అప్లికేషన్లను స్వీకరిస్తోంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ RPA డెవలపర్/కన్సల్టెంట్, ప్రిన్సిపాల్ ఆర్కిటెక్ట్, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్-జావా మైక్రో సర్వీసెస్‌తో సహా అనేక జాబ్ ప్రొఫైల్‌ల కోసం నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో మెజారిటీ (Megarity) ఉద్యోగాలు బెంగుళూరుకు చెందినవే ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ (Capitalization) ప్రకారం భారతదేశంలోని అతిపెద్ద ఐటి సంస్థలలో ఇన్ఫోసిస్ ఒకటి, ఈ సంస్థకు భారతదేశంలో మరియు విదేశాలలో 259,619 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇటీవలే ఇన్ఫోసిస్ పలు రిక్రూట్మెంట్ డ్రైవ్ (Recruitment Drive) ల ద్వారా భారతదేశంలో 19,230 గ్రాడ్యుయేట్లను నియమించింది. అంతే కాకుండా విదేశాల్లో 1,941 మంది కొత్త వారిని ఉద్యోగంలోకి తీసుకొంది.
పోస్టల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు
అర్హతలు
జీతం (అంచనా)
స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (MEAN/MERN)
యూఐ అండ్ మార్క్‌అప్ లాంగ్వేజస్ వచ్చి ఉండాలి. ఆంగ్యులర్ 1 నుంచి 8 లాంగ్వేజస్, హెచ్ టీఎమ్ఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి.
సంవత్సరానికి రూ.8,25,513
స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (Java Microservices)
CASTపై కమాండ్, జావా, హైబర్నేట్ అవగాహన ఉండాలి.
సంవత్సరానికి రూ.1,80,429 - రూ .21,23,761 వరకు ఉండవచ్చు.
స్పెషలిస్ట్ ప్రోగ్రామర్-బిగ్‌డేటా
బిగ్‌డేటా, స్పార్క్ ఓపెన్ సోర్స్ లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.
సంవత్సరానికి రూ.1,80,429 - రూ .21,23,761 వరకు ఉండవచ్చు.
దరఖాస్తు చేసుకొనే విధానం..
- కేవలం ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
- అనంతరం అధికారిక వెబ్ సైట్ https://www.infosys.com/careers/apply.html సందర్శించాలి.
- అక్కడ కంట్రీ ఇండియాను ఎంచుకోవాలి.
- అనంతరం అభ్యర్థి పోస్టును క్లిక్ చేసి అప్లే చేసుకోవాలి.
- వర్డ్/ పీడీఎఫ్ ఫార్మెట్ లో రెజ్యూమ్ ను అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు చేసుకోవాలనుకొన్న అభ్యర్థి వయసు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ జూన్ త్రైమాసిక లాభం 23 శాతం పెరిగింది. 2021-22 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి కంపెనీ నికర లాభం 22.7 శాతం పెరిగి 5,195 కోట్లకు చేరుకుంది. బెంగుళూరుకు చెందిన కంపెనీ నికర లాభం (మైనారిటీ వడ్డీ తర్వాత) ఏప్రిల్-జూన్ 2020 లో రూ. 4,233 కోట్లు వచ్చినట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. ఐటీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరం 22 వ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ .23,665 కోట్ల నుంచి 17.8 శాతం పెరిగి రూ .27,896 కోట్లకు చేరింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.