ప్రభుత్వ లేదా ప్రైవేట్(Private) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేస్ నుండి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(Airport Authority Of India) వరకు అనేక సంస్థల్లో వివిధ పోస్టుల కోరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను(Applications) కోరుతున్నాయి. ఈ విభిన్న రంగాలలో విడుదల అయిన ఉద్యోగ నోటిఫికేషన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.ఉద్యోగాలకు మీరు మీ అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు.
భారతీయ రైల్వే రిక్రూట్మెంట్..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ 80 పోస్టులకు ఐటీఐ డిప్లొమా ఉన్న 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 15 నుండి 25 సంవత్సరాలు. స్టైపిండ్ రూ. 5 నుంచి రూ. 9 వేల వరకు ఇస్తారు. వివరాలను తెలుసుకోవడానికి irctc.com/new-openings.htmlని సందర్శించండి.
చివరి తేదీ - 25 అక్టోబర్ 2022
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా..
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 44 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా ఉన్న 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు వయోపరిమితి 26 ఏళ్లు. వీరికి నెలకు 9 వేల స్టైఫండ్ ఇస్తారు. ఎంపిక ఇంటర్వ్యూ మరియు DV రౌండ్ ఆధారంగా ఉంటుంది. వివరాలకు www.aai.aero ని సందర్శించండి .
చివరి తేదీ - 07 నవంబర్ 2022
AIIMS రిషికేశ్ రిక్రూట్మెంట్ 2022..
AIIMS రిషికేశ్‌లో 17 వేర్వేరు పోస్టుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. MBBS లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 56 సంవత్సరాలు. వివరాల కోసం aiimsrishikesh.edu.in ని సందర్శించండి.
చివరి తేదీ - 31 అక్టోబర్ 2022
ఢిల్లీలోని NIEIT లో ఉద్యోగాలు ..
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైంటిస్ట్ సి అండ్ డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MSc/MCA అభ్యర్థులు ఈ 27 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 35 నుండి 40 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.800. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
చివరి తేదీ - 04 నవంబర్ 2022
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో..
కోల్‌కతాలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా 33 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 28 ఏళ్లు మించని గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లో పీజీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.400. వివరాలను తెలుసుకోవడానికి bsi.gov.inని సందర్శించండి .
చివరి తేదీ - ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 30 రోజులలోపు
సర్దార్ పటేల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు..
జోధ్‌పూర్‌లోని సర్దార్ పటేల్ యూనివర్శిటీ ఆఫ్ పోలీస్ 28 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సీనియర్ మరియు జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. వీటికి MTech/ MCA/ ME/ B.Sc అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 18 నుండి 40 సంవత్సరాలు. దరఖాస్తు రుసుము రూ. 950. www.policeuniversity.ac.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
చివరి తేదీ - 02 నవంబర్ 2022
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central Government Jobs, Central jobs, JOBS, Railway jobs