వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం స్పెషల్ కోర్సును డిజైన్ చేసింది NIIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ (NIIT IFBI) సంస్థ. HDFC బ్యాంక్‌తో కలిసి డేటా ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారిని ఉద్యోగాల్లో నియమించుకుంటుంది. ‘డేటా డిజిట్స్’గా పిలిచే ఈ సర్టిఫికేట్ కోర్సు వ్యవధి 12 వారాలు ఉంటుంది. ఇది అభ్యర్థులను ఉద్యోగాలకు సిద్ధం చేస్తుందని ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏడాదిలో దాదాపు 100 మంది డేటా సైంటిస్టులను నియమించుకోవాలని HDFCబ్యాంక్ భావిస్తోంది.
ఈ స్పెషల్ కోర్సు అర్హతలను సంస్థ వెల్లడించింది. అభ్యర్థులు ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్, MBA అనలిటిక్స్ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు రెండేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. డేటా సైన్స్ అనే న్యూ- ఏజ్ టెక్ రంగంలో ప్రతిభను పెంపొందించడం, డేటాను అర్థవంతంగా, సమగ్రంగా వినియోగించేలా ట్రైనింగ్ ఇవ్వడం, ఉపయోగపడే బిజినెస్ ఇన్‌సైట్స్ డెలివర్ చేయడం ఈ
ప్రోగ్రామ్ లక్ష్యమని తెలిపింది NIIT. HDFC బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ పీజీ ప్రోగ్రామ్‌లో లైవ్ సెషన్స్ ద్వారా బోధిస్తారు. దీంతోపాటు ఇన్‌స్ట్రక్టర్ నేతృత్వంలో సెషన్స్, గెస్ట్ లెక్చర్స్ కూడా ఉంటాయి.
ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన సందర్భంగా HDFC బ్యాంక్ హ్యూమన్ రిసోర్సెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రంగా సుబ్రమణియన్ మాట్లాడారు. ‘డేటా అనలిటిక్స్, బిగ్ డేటా ఫండమెంటల్స్ వంటి కీలక నైపుణ్యాలను హైలైట్ చేసే కంప్లీట్ ట్రైనింగ్ మాడ్యూల్‌ను అందించడానికి ఈ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేశారు. ఈ ట్రైనింగ్ బిజినెస్ ఇన్‌సైట్స్ కోసం విజువలైజేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుస్తుంది. నైపుణ్యాలు, నాలెడ్జ్, టెక్నాలజీపై పట్టు ఉన్న వర్క్‌ఫోర్స్‌ను అందించడంలో మార్కెట్ లీడర్ అయిన NIITతో ఒప్పందం చేసుకోవడం మంచి విషయం. ఈ పార్ట్నర్‌షిప్‌తో డేటా సైన్స్‌లో కెరీర్ కొనసాగించాలనుకునే వారి కోసం సరైన లాంచ్ ప్యాడ్‌ను రూపొందించగలమని మేము భావిస్తున్నాం.’ అని తెలిపారు.
ఎన్‌ఐఐటీ లిమిటెడ్ స్కిల్స్ అండ్ కెరీర్ బిజినెస్ (ఇండియా) ప్రెసిడెంట్ బిమల్‌జీత్ సింగ్ భాసిన్ మాట్లాడుతూ.. ‘NIITలో స్కిల్డ్ హ్యూమన్ క్యాపిటల్‌ను నిర్మించడానికి, వర్క్‌ఫోర్స్ టాలెంట్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లెర్నర్స్ డేటా ఇంజనీరింగ్ వంటి న్యూ ఏజ్ టెక్నాలజీపై పట్టు సాధించాలి. HDFC బ్యాంక్‌తో మా వ్యూహాత్మక భాగస్వామ్యం టాలెంట్ పైప్‌లైన్‌ను బలోపేతం చేస్తుందని నమ్ముతున్నాం. ఒప్పందంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఫస్ట్ ప్రోగ్రామ్.. హై క్వాలిటీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్‌ను సంయుక్తంగా అందించడంలో ఒక ముందడుగు అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా లెర్నర్స్ డేటా ఇంజనీరింగ్‌లో స్ట్రాంగ్ కెరీర్‌ను నిర్మించుకోగలుగుతారు.’ అని చెప్పారు. కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్ చెక్ చేయాలని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Engineering course, Hdfc, JOBS