హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Notifications: ఈ జాబ్స్ కు మీరు దరఖాస్తు చేశారో లేదో చూసుకోండి.. ఎందుకంటే.. ఇక వారం రోజులే..

Job Notifications: ఈ జాబ్స్ కు మీరు దరఖాస్తు చేశారో లేదో చూసుకోండి.. ఎందుకంటే.. ఇక వారం రోజులే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమూల్ ఇండియా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఇండియా, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ యూనివర్సిటీ వంటి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవో చూద్దాం.

ఇంకా చదవండి ...

ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటారు. కొందరు తాము అనుకున్న రంగంలో గొప్పగా ఎదగాలని భావిస్తే.. మరికొందరు వివిధ కారణాలతో చేస్తున్న పనితోనే సంతృప్తి పొందుతుంటారు. ఇలాంటి వారి కోసం అనేక బడా వ్యాపార సంస్థలు వివిధ కేటగిరిల్లో(Category) పోస్ట్‌ల(Posts) భర్తీకి దరఖాస్తులను(Applications) ఆహ్వానిస్తున్నాయి. అమూల్ ఇండియా(Amool India), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఇండియా(Airports Authority of india), ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau), ఢిల్లీ యూనివర్సిటీ వంటి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవో చూద్దాం.

* పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)

పీఎన్‌బీ బ్యాంకు భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. రిస్క్ మేనేజర్ పోస్టులు- 40, క్రెడిట్ మేనేజర్లు 100, సీనియర్ మేనేజర్లు 5 సహా మొత్తం 145 మేనేజర్ పోస్టులను భర్తీ చేయాలని PNB చూస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Moto G52: బడ్జెట్ ధరలో మోటో జీ52 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

* ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తూర్పు ప్రాంతంలోని RCS (రీజనల్ కనెక్టివిటీ స్కీమ్) విమానాశ్రయాల కోసం మొత్తం ఎనిమిది పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు సీనియర్, జూనియర్ కన్సల్టెంట్ (ఆపరేషన్స్)కు సంబంధించినవి. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను మే 15 లోపు పంపాల్సి ఉంటుంది.

* అమూల్ ఇండియా

ప్రముఖ డెయిరీ ఫాం అమూల్ ఇండియా అకౌంటింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడలోని మిల్క్ మార్కెటింగ్ కో ఆపరేటివ్ ఆఫీసులో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అమూల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారుడి వయస్సు 28 ఏళ్లకు మించి ఉండకూడదు.

* యూపీఎస్సీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 253 అసిస్టెంట్ కమాండెంట్లను రిక్రూట్ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు మే 10లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల భర్తీ కోసం యూపీఎస్సీ ఆగస్టు 7న పరీక్ష నిర్వహించనుంది.

* ఇంటెలిజెన్స్ బ్యూరో

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) పరీక్ష- 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ACIO గ్రేడ్-II/ టెక్నికల్ పోస్టుల కోసం అర్హత ఉన్న అభ్యర్థులు కేంద్ర హోం శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా మే7గా నిర్ణయించారు.

Flipkart Offer: ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది... ఆఫర్ కొద్ది రోజులే

* JSSB ఛత్తీస్‌గఢ్ హెల్త్ డిపార్ట్‌మెంట్

ఛత్తీస్‌గడ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో174 గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. సర్గుజా‌లోని స్పెషల్ జూనియర్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ ఈ నియామకాలను చేపట్టనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 20లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

* ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కిరోరి మాల్ కాలేజ్ వివిధ విభాగాల్లో పని చేసేందుకు 110 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హత ఉన్న అభ్యర్థులు https://colrec.du.ac.in/ లేదా https://colrec.du.ac.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లేకపోతే కళాశాల లేదా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మే 6, 2022 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ప్రకటించారు.

First published:

Tags: Applications, Career and Courses, IT jobs, JOBS

ఉత్తమ కథలు