హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Govt Jobs 2023: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. మీ కోసమే ఈ ఉద్యోగాలు

AP Govt Jobs 2023: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. మీ కోసమే ఈ ఉద్యోగాలు

విశాఖ జిల్లాలో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ

విశాఖ జిల్లాలో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ

విశాఖపట్నం (Visakhapatnam) లో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ పోస్టులకు (Handicapped Backlog posts) నోటిఫికేషన్ వెలువడింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

విశాఖపట్నం (Visakhapatnam) లో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ పోస్టులకు (Handicapped Backlog posts) నోటిఫికేషన్ వెలువడింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (విశాఖపట్నం, అనకాపల్లి , అల్లూరి సీతారామరాజు) జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖలలో విభిన్న ప్రతిభావంతులది (దివ్యాంగులకు) కేటాయించబడిన 24 బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయుటకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడమైనది. వీరి అభ్యర్థి వయస్సు దరఖాస్తు చేసేనాటికి 18సంవత్సరము లు పైబడి. ది. 01-07-2003 వాటికి 52 (42-10) సంవత్సరాలకు మించరాదు.

దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేది. 13-04-2003 ఆందులకు ఉద్యోగ ఖాళీలు (9), బధిరులకు ఉద్యోగ ఖాళీలు,(8) శారీరక వైకల్యం గల వారికి ఉద్యోగ ఖాళీలు (7) కలవు అవసరమైన కనీస అర్హతలు తెలియజే పూర్తి నోటిఫికేషన్ పోస్టుల వారీగా వివరాలు, సూచనలు ధరఖాస్తు ఫారముతో సహా https:/yinakhapatnam.ap.gov.in వెబ్ సైట్ నుండి పొందవచ్చును.

ఇది చదవండి: అందమైన హ్యాండ్ రైటింగ్ ‌తో సంపాదించుకునే ఛాన్స్.. ఎలాగంటే..!

పూర్తి చేయబడిన దరఖాస్తులు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, రాణీ చంద్రమణి దేవి ఆయయత్రి ప్రాంగణం, పేద వాల్తేర్ ఆంక్షన్, విశాఖపట్నం- 530017 అను చిరునామాకు తేది. 13-04-2003 సాయంత్రం గం॥ 5 గంటలలోపు కార్యాలయపు పని దినములలో స్వయంగా గాని లేదా పోస్టు ద్వారా గాని అందజేయవలేదు. గడువు తేదీ తదుపరి అందిన దరఖాస్తులు స్వీకరించబడవు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు