JOB NEWS THESE ARE THE BEST COMPANIES IN THE COUNTRY DO YOU KNOW HOW MANY EMPLOYEES ARE WORKING EVK
Job News: దేశంలో బెస్ట్ కంపెనీలు ఇవే.. ఎంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)
Job News | మంచి కంపెనీ ఉద్యోగి కెరీర్ ను పూర్తిగా మార్చేస్తుంది అనడంలో సందేహం లేదు. ముందుగా కంపెనీలో జాయిన్ అయినా డ్రీమ్ కంపెనీ అంటూ ఒకటి ఉంటుంది. ఈ నేపథ్యంలో కెరీర్లో వేగంగా అభివృద్ధి సాధించడానికి భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీల జాబితాను ప్రముఖ ఆన్లైన్ ప్రొఫెషనల్ నెట్వర్క్(Network) సంస్థ లింక్డ్ఇన్(LinkedIn) రూపొందించింది.
మంచి కంపెనీ ఉద్యోగి కెరీర్ ను పూర్తిగా మార్చేస్తుంది అనడంలో సందేహం లేదు. ముందుగా కంపెనీలో జాయిన్ అయినా డ్రీమ్ కంపెనీ అంటూ ఒకటి ఉంటుంది. ఈ నేపథ్యంలో కెరీర్లో వేగంగా అభివృద్ధి సాధించడానికి భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీల జాబితాను ప్రముఖ ఆన్లైన్ ప్రొఫెషనల్ నెట్వర్క్(Network) సంస్థ లింక్డ్ఇన్(LinkedIn) రూపొందించింది. లింక్డ్ఇన్ భారతదేశంలో పని చేయడానికి అత్యుత్తమ 25 ఉత్తమ కంపెనీల(Best Companies) జాబితాను విడుదల చేసింది. ఈ 25 కంపెనీలు ఉద్యోగులకు వృత్తిపరమైన పునాదిని నిర్మించడంలో సహాయపడతాయని తెలిపింది. ఏడు ప్రధాన అంశాల ఆధారంగా లింక్డ్ఇన్ సంస్థలను ఎంపిక చేసింది. ముందుకు సాగే సామర్థ్యం, నైపుణ్యాభివృద్ధి, కంపెనీ స్థిరత్వం, ఎక్స్టర్నల్ ఆపర్చునిటీ, కంపెనీ అఫిలియేషన్, జెండర్ డైవెర్సిటీ, విద్యా నేపథ్యం వంటి అంశాలను పరిశీలించింది.
1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS)
టీసీఎస్‌లో హాల్ఫ్ మిలియన్ మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. భారతదేశంలోని ఇతర ఐఐటీ కంపెనీలలో పోలిస్తే అత్యల్ప అట్రిషన్ రేటును కలిగి ఉంది. 2021 ఏప్రిల్, డిసెంబర్ మధ్య కాలంలో 1,10,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చామని కంపెనీ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగులు: 556,000
టాప్ ఇండియా లొకేషన్స్: చెన్నై, బెంగళూరు, ముంబై
అవసరమైన ప్రధాన నైపుణ్యాలు: C (ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్), జావా, PL/SQL
మోస్ట్ కామన్ జాబ్ టైటిల్స్: సిస్టమ్ ఇంజనీర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనలిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజినీర్
2. యాక్సెంచర్
గత సంవత్సరం భారతదేశంలో జెండర్ న్యూట్రల్ పాలసీ విధానం అవలంభించిన తర్వాత.. యాక్సెంచర్ దాని లక్ష్యం 50:50 ప్రాతినిధ్యానికి చేరువైంది. ఇప్పుడు యాక్సెంచర్ మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 45 శాతం ఉన్నారు. జైపూర్, కోయంబత్తూర్ వంటి టైర్ 2 నగరాల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు కంపెనీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. యాక్సెంచర్ మార్కెట్లు, పరిశ్రమలు, సేవా రంగంలో రెండంకెల వృద్ధిని సాధిస్తోంది. ఈ సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాలను పెంచింది.
ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగులు: 674,000
టాప్ ఇండియా లొకేషన్స్: బెంగళూరు, ముంబై, హైదరాబాద్
అవసరమైన ప్రధాన నైపుణ్యాలు: జావా, ఫంక్షనల్ టెస్టింగ్, మైక్రోసాఫ్ట్ అజూర్
మోస్ట్ కామన్ జాబ్ టైటిల్స్: అప్లికేషన్ డెవలప్మెంట్ అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్
లార్జెస్ట్ జాబ్ ఫంక్షన్స్: ఇంజినీరింగ్, ఆపరేషన్స్, మానవ వనరులు
3. కాగ్నిజెంట్
భారతీయ ఐటీ సంస్థలలో అత్యధిక అట్రిషన్ రేటుతో పోరాడుతూ.. కాగ్నిజెంట్ నియామకాల జోరు మీద ఉంది. ఇది 2022లో 50,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోవాలనే యోచనలో ఉంది. గత ఏడాది 33,000 మందికి అవకాశాలు కల్పించింది. న్యూజెర్సీలో ప్రధాన కార్యాలయం ఉంది. ప్రమోషన్లు, అధిక బోనస్‌లను అందించడంతోపాటు ఉద్యోగుల శిక్షణ, అభివృద్ధిలో పెట్టుబడులు పెడుతోంది. 2015 తర్వాత కాగ్నిజెంట్ 2021 చివరి త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగులు: 330,600 (భారతదేశంలో 239,955)
టాప్ ఇండియా లొకేషన్స్: చెన్నై, బెంగళూరు, హైదరాబాద్
అవసరమైన ప్రధాన నైపుణ్యాలు: సెలీనియం, జావా, స్ప్రింగ్ బూట్
మోస్ట్ కామన్ జాబ్ టైటిల్స్: ప్రోగ్రామింగ్ అనలిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్
లార్జెస్ట్ జాబ్ ఫంక్షన్స్: ఇంజినీరింగ్, ఆపరేషన్స్, వ్యాపార అభివృద్ధి
4. ఇన్ఫోసిస్
డిజిటల్, క్లౌడ్‌పై దృష్టి సారిస్తూ ఇన్ఫోసిస్ గత సంవత్సరం లాభాలలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో 100 బిలియన్ల డాలర్లను తాకిన భారతదేశపు ననాలుగో కంపెనీగా నిలిచింది. ఇన్ఫోసిస్ తన డిజిటల్ రీస్కిల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 1.2 మిలియన్లకు పైగా వినియోగదారులను ఆన్‌బోర్డ్ చేసింది. కంపెనీ 2022 ఆర్థిక సంవత్సరంలో 55,000 కంటే ఎక్కువ కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. వచ్చే ఏడాది కూడా ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకొనే యోచనలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగులు: 292,070 (భారతదేశంలో 231,690)
టాప్ ఇండియా లొకేషన్స్: బెంగళూరు, హైదరాబాద్, చెన్నై
అవసరమైన ప్రధాన నైపుణ్యాలు: కోర్ జావా, డేటాబేస్ మేనేజ్మెంట్ (DBMS), స్ప్రింగ్ బూట్
మోస్ట్ కామన్ జాబ్ టైటిల్స్: సిస్టమ్ ఇంజినీర్, టెక్నాలజీ అనలిస్ట్, టెక్నాలజీ లీడ్
లార్జెస్ట్ జాబ్ ఫంక్షన్స్: ఇంజినీరింగ్, క్వాలిటీ అస్యూరెన్స్, ఆపరేషన్స్
5. క్యాప్ జెమిని
క్యాప్‌జెమినీలో పని చేస్తున్న వారిలో దాదాపు సగం మంది భారతదేశంలో ఉన్నారు. 5G ఆధారిత ఎంటర్ప్రైజ్ గ్రేడ్ సొల్యూషన్స్‌పై పని చేయడంతో పాటు క్వాంటం కంప్యూటింగ్, మెటావర్స్, సింథటిక్ బయాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి పెట్టాలని క్యాప్‌జెమిని యోచిస్తోంది. ఫ్రెంచ్ ఐటీ కంపెనీ అయిన క్యాప్‌జెమిని ఈ ఏడాది భారతదేశంలో 60,000 మందికి పైగా కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది.
Jobs in AP: చిత్తూరు జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. నెలకు వేతనం రూ.18,500.. అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్
ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగులు: 324,700 (భారతదేశంలో 150,000)
టాప్ ఇండియా లొకేషన్స్: బెంగళూరు, ముంబై , హైదరాబాద్
అవసరమైన ప్రధాన నైపుణ్యాలు: కోర్ జావా, స్ప్రింగ్ బూట్, జావా సెలీనియం
మోస్ట్ కామన్ జాబ్ టైటిల్స్: సాఫ్ట్వేర్ ఇంజినీర్, సాఫ్ట్వేర్ అనలిస్ట్, ప్రాసెస్ అసోసియేట్
లార్జెస్ట్ జాబ్ ఫంక్షన్స్: ఇంజినీరింగ్, ఆపరేషన్స్, ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్
6. విప్రో
విప్రో 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 30,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో 17,500 మందికి అవకాశాలు కల్పించింది. ఇటీవల US ఆధారిత సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ Edgileని కొనుగోలు చేసింది. రీజెనరేటివ్ మెడిసిన్‌పై పరిశోధనను వేగవంతం చేయడానికి బయోటెక్ సంస్థ పండోరమ్ టెక్నాలజీస్‌తో కలిసి పనిచేస్తోంది. విప్రో కూడా గత సంవత్సరం రిటర్న్ టు వర్క్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. విరామం తర్వాత కెరీర్‌పై దృష్టి పెడుతున్న మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగులు: 249,265
టాప్ ఇండియా లొకేషన్స్: బెంగళూరు, హైదరాబాద్, చెన్నై
అవసరమైన ప్రధాన నైపుణ్యాలు: ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా, మాన్యువల్ టెస్టింగ్
మోస్ట్ కామన్ జాబ్ టైటిల్స్: ప్రాజెక్ట్ ఇంజినీర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, టెక్నికల్ లీడ్
లార్జెస్ట్ జాబ్ ఫంక్షన్స్: ఇంజినీరింగ్, ఆపరేషన్స్, ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్
7. ఐబీఎం(IBM)
IBM తన సాఫ్ట్వేర్ పోర్ట్‌ఫోలియో వృద్ధిని పెంచే అభివృద్ధి కేంద్రాలను నిర్మించడంపై దృష్టి సారించి. 2022కి సమగ్ర వృద్ధి వ్యూహాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. టెక్ దిగ్గజం తన హైబ్రిడ్ క్లౌడ్ కన్సల్టింగ్ సామర్థ్యాలను పెంచుకోవడానికి 2020 ఏప్రిల్ నుంచి దాదాపు 20 కంపెనీలను కొనుగోలు చేసింది. నాన్ మెట్రో నగరాల్లోకి విస్తరించాలని IBM యోచిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగులు: 282,100
టాప్ ఇండియా లొకేషన్స్: బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ
అవసరమైన ప్రధాన నైపుణ్యాలు: మైక్రోసాఫ్ట్ అజూర్, కోర్ జావా, IBM క్లౌడ్
మోస్ట్ కామన్ జాబ్ టైటిల్స్: అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, అసోసియేట్ సిస్టమ్ ఇంజినీర్
లార్జెస్ట్ జాబ్ ఫంక్షన్స్: ఇంజినీరింగ్, ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్
8. HCL టెక్నాలజీస్
టెక్ టాలెంట్‌కు డిమాండ్, సప్లై గ్యాప్‌ను భర్తీ చేయడానికి HCL టెక్నాలజీస్ ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోనుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 22,000 మందికి అవకాశాలు కల్పించగా.. వచ్చే ఏడాది ఆ సంఖ్యను 40,000- 45,000కి పెంచాలని నిర్ణయించింది. కొత్త చేరికలు, మిడ్ లెవల్ మేనేజర్ల కోసం 5 సంవత్సరాల పరిహారం విజిబిలిటీ రోడ్‌మ్యాప్‌ను ప్రవేశపెట్టింది. గత నెలలో కంపెనీ దాని ఆగ్మెంటెడ్ నెట్వర్క్ ఆటోమేషన్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించిన రెండు 5G అప్లికేషన్లను ప్రారంభించింది.
ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగులు: 197,780
టాప్ ఇండియా లొకేషన్స్: చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు
అవసరమైన ప్రధాన నైపుణ్యాలు: SQL, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, జావా
మోస్ట్ కామన్ జాబ్ టైటిల్స్: సాఫ్ట్వేర్ ఇంజినీర్, టెక్నికల్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్
లార్జెస్ట్ జాబ్ ఫంక్షన్స్: ఇంజినీరింగ్, ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్
9. ఎల్ అండ్ టీ(L&T)
చాలా కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవడంపై దృష్టి సారిస్తుండగా L&T పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రతిభను సృష్టించడంపై దృష్టి సారిస్తోంది. కంపెనీ గత ఏడాది చివర్లో యాప్ ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. ఇటీవల సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ మొదటి సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలు, ONGC కోసం సబ్ సీ పైప్లైన్ల ఏర్పాటు, బంగ్లాదేశ్ అంతటా హైటెక్ IT పార్కుల నిర్మాణాల ఒప్పందాలు చేసుకొంది.
ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగులు: 52,040 (భారతదేశంలో 48,245)
టాప్ ఇండియా లొకేషన్స్: ముంబై, చెన్నై, బెంగళూరు
అవసరమైన ప్రధాన నైపుణ్యాలు: AutoCAD, కోర్ జావా, సైట్ ఎగ్జిక్యూషన్
మోస్ట్ కామన్ జాబ్ టైటిల్స్: సివిల్ ఇంజినీర్, అసిస్టెంట్ కన్స్ట్రక్షన్ మేనేజర్, సైట్ మేనేజర్
లార్జెస్ట్ జాబ్ ఫంక్షన్స్: ఇంజినీరింగ్, ఆపరేషన్స్, క్వాలిటీ అస్యూరెన్స్
10. డెలాయిట్
డెలాయిట్ 345,000 మంది ఉద్యోగులలో దాదాపు 15 శాతం మంది భారతదేశంలో ఉన్నారు. వర్క్‌ఫోర్స్ వైవిధ్యాన్ని పెంచడానికి, ఉద్యోగులకు సౌలభ్యాన్ని అందించడానికి కంపెనీ టైర్ 2, టైర్ 3 నగరాలలో విస్తరించాలని భావిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగులు: 345,000 (భారతదేశంలో 15,000)
టాప్ ఇండియా లొకేషన్స్: హైదరాబాద్, బెంగళూరు, ముంబై
అవసరమైన ప్రధాన నైపుణ్యాలు: కోర్ జావా, SAP హనా, అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ (ABAP)
మోస్ట్ కామన్ జాబ్ టైటిల్స్: సొల్యూషన్స్ అడ్వైజర్, టాక్స్ కన్సల్టెంట్, బిజినెస్ టెక్నాలజీ అనలిస్ట్
లార్జెస్ట్ జాబ్ ఫంక్షన్స్: అకౌంటింగ్, కన్సల్టింగ్, వ్యాపార అభివృద్ధి
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.