హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job News: ఆ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు.. క‌రోనా త‌రువాత మారిన ప‌రిస్థితి

Job News: ఆ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు.. క‌రోనా త‌రువాత మారిన ప‌రిస్థితి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Job News | కరోనా(Corona) మహమ్మారి కారణంగా కుదేలైన రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడడంతో అన్ని దేశీయ కంపెనీలు(Companies) నియామకాలను చేపడుతున్నాయి. అయితే క‌రోనా త‌రువాత ఏ రంగంలో నియామ‌కాలు ఎక్కువ‌గా ఉన్నాయి.. ఎంత వృద్ధి సాధించాయి అనే విష‌యం తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

కరోనా(Corona) మహమ్మారి కారణంగా కుదేలైన రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడడంతో అన్ని దేశీయ కంపెనీలు(Companies) నియామకాలను చేపడుతున్నాయి. ఏప్రిల్‌లో(April) నియామకాలు 36 శాతానికి (Year In Year)) పెరిగాయని, దీంతో మెట్రో(Metro), నాన్ మెట్రో నగరాలకు ఇది సానుకూలంగా మారనుందని జాబ్ పోర్టల్ ప్లాట్‌ఫామ్ Naukri.com నివేదిక తెలిపింది. కరోనా సమయంలో అత్యంత నష్టపోయిన రంగాల్లో ట్రావెల్(Travel) & హాస్పిటాలిటీ ఒకటి. ఈ సెక్టార్‌లో రిక్రూట్‌మెంట్ గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మూడంకెల వృద్ధిని సాధించడం గమనార్హం. నౌకరీ జాబ్‌స్పీక్ ఏప్రిల్ 2022 ఇండెక్స్ ప్రకారం.. దేశంలో నియామకాలు 38 శాతం (y-o-y) వృద్ధిని నమోదు చేశాయి.

New Course: డిజిటల్ హెల్త్​ రంగంలో కెరీర్ ఎంచుకోవాలంటే.. బెస్ట్ ఆన్‌లైన్ కోర్సు.. అర్హత, ఫీజు వివరాలు!

ట్రావెల్ & హాస్పిటాలిటీ  (Travel and Hosipitality) రంగం నియామకాల్లో ఇయర్ ఆన్ ఇయర్ 169 శాతం వృద్ధిని సాధించగా, రిటైల్ 112 శాతం వృద్ధిని కనబరిచినట్లు నివేదిక పేర్కొంది. ఇక 0-3 సంవత్సరాల ఫ్రెషర్ బ్యాండ్ అంశంలో ఏప్రిల్ 2022లో ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ రంగం అత్యధికంగా 214 శాతం వృద్ధిని కనబర్చింది.

విద్యా రంగం కూడా 108 శాతంతో అద్భుతమైన వేగంతో వృద్ధి చెందింది.

Job News: డిగ్రీ చేసి డ్రైవర్ ఉద్యోగం.. పీజీ చదివి కానిస్టేబుల్.. పోలీస్ జాబ్స్ ద‌ర‌ఖాస్తులో ఆస‌క్తిక అంశాలు

రియల్ ఎస్టేట్ 89 శాతం, బీమా 83 శాతం, బీఎఫ్ఎస్‌ఐ 77 శాతం వృద్ధిని నమోదు చేశాయని నివేదిక పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే నియామక కార్యకలాపాలలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది.

మెట్రో నగరాల్లో ముంబై 63 శాతం వృద్ధిని నమోదు చేసింది. కొత్త ప్రతిభకు డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో నియామకాల్లో ఈ వృద్ధి సాధ్యమైంది. నాన్-మెట్రోల్లో కోయంబత్తూర్ మళ్లీ రేసులో అగ్రగామిగా నిలిచింది. దీంతో పాజిటివ్ రిక్రూట్‌మెంట్ సెంటిమెంట్‌తో గత సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్‌లో 63 శాతం వద్ద బలమైన వృద్ధి పథాన్ని నమోదు చేసింది.

ఇటీవలే విడుదలైన మరో నివేదిక మాన్‌స్టర్ ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ (Employment Index) ప్రకారం.. నియామక కార్యకలాపాలు ఈ ఏడాది మార్చిలో 6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. బ్యాంకింగ్, టెలికాం వంటి రంగాల మద్దతుతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో ఇది సాధ్యమైందని నివేదిక స్పష్టం చేసింది. అయితే, అంచనాల సీజన్ కారణంగా ఫిబ్రవరితో పోల్చితే నియామక కార్యకలాపాల్లో 2.4 శాతం స్వల్ప తగ్గుదల ఉన్నట్లు నివేదిక తెలిపింది.

UPSC Civil Services result: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల..సెల‌క్ట్ అయిన‌ తెలుగు విద్యార్థులు వీరే!

Quess కంపెనీకి చెందిన Monster.com చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శేఖర్ గరిసా మాట్లాడుతూ.. కరోనాతో గత రెండేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొందని.. అయితే ఇప్పుడు వాటిని అధిగమించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 2020తో పోల్చితే ఈ సంవత్సరం 6 శాతం మేర వృద్ధిని సాధించామని, అయితే కోవిడ్‌కు ముందు స్థాయిలను మించిన వేగాన్ని అందుకోవడం సవాళ్లతో కూడుకున్నదని శేఖర్ గరిసా అభిప్రాయపడ్డారు.

మాన్‌స్టర్ ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. మార్చి నెలలో బ్యాకింగ్, ఇన్సూరెన్స్ సెక్టార్‌ల్లో నియాకాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. 37 శాతం వృద్ధితో బ్యాకింగ్, టెలికాం 17 శాతం, ఉత్పత్తి, తయారీ రంగాలు 16 శాతం వృద్ధిని నియామకాల్లో కనబర్చాయని నివేదిక తెలిపింది.

First published:

Tags: IT jobs, JOBS, Private Jobs

ఉత్తమ కథలు