Home /News /jobs /

JOB NEWS GOOD NEWS FOR THE UNEMPLOYED PUNJAB GOVERNMENT TO LAUNCH TELEGRAM CHANNEL FOR JOB NEWS EVK

Job News: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. జాబ్ న్యూస్ కోసం టెలిగ్రామ్ చాన‌ల్ ప్రారంభించ‌నున్న‌ ప్ర‌భుత్వం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Job News | చాలా మంది ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు.. ప్రైవేటు జాబ్ మేళాల‌కు ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే ఎప్పుడు ఎక్కడ జాబ్ మేళా (Job Fair) జ‌రుగుతుందనే స‌మాచారం తెలుసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. అలాంటి అభ్య‌ర్థుల‌కు ఇలాంటి స‌మాచారం అంతా ఒకే చోట దొరికితే చాలా సుల‌భంగా అవ‌కాశాల‌ను అందుకోగ‌లరు

ఇంకా చదవండి ...
    చాలా మంది ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు.. ప్రైవేటు జాబ్ మేళాల‌కు ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే ఎప్పుడు ఎక్కడ జాబ్ మేళా (Job Fair) జ‌రుగుతుందనే స‌మాచారం తెలుసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. అలాంటి అభ్య‌ర్థుల‌కు ఇలాంటి స‌మాచారం అంతా ఒకే చోట దొరికితే చాలా సుల‌భంగా అవ‌కాశాల‌ను అందుకోగ‌లరు. ఈ విష‌యం గుర్తించిన పంజాబ్ ప్ర‌భుత్వం.. ప్ర‌భుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు (Private Jobs).. జాబ్ మేళాలు.. క్యాంప‌స్ ప్లేస్‌మెంట్‌లు (Campus Placements) .. కోచింగ్ సెంట‌ర్ (Coaching Centre)  స‌మాచారం వంటివి అందించేందుకు టెలిగ్రామ్ చాన‌ల్‌ను ప్రార‌భించ‌నుంది.

    Jobs in Telangana: కేంద్రీయ విద్యాల‌యంలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ.27,500

    ఈ చాన‌ల్ ప్రారంభ‌పై జలంధర్ జిల్లాబ్యూరో ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజెస్ డిప్యూటీ డైరెక్ర్ యశ్వంత్ రాయ్ మాట్లాడారు. ఈ చానల్ ఉద్యోగ స‌మాచారాన్ని అందిస్తుంద‌ని తెలిపారు. ఈ చాన‌ల్‌లో ఎవ‌రైనా చేర‌వ‌చ్చ‌ని తెలిపారు. ఉపాధి అవ‌కాశాల గురించి ఎక్క‌డో వెత‌క‌కుండా.. స‌రైన స‌మాచారాన్ని ఒకే చోట అందుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఇది ఉద్యోగ ఔత్సాహికుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందని ఆయ‌న అన్నారు.

    Govt Jobs 2022: ప‌రీక్ష లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. వాక్ ఇన్ నిర్వహిస్తున్న సంస్థల వివ‌రాలు

    పోస్టుల భ‌ర్తీకి శ్రీ‌కారం..
    పంజాబ్‌ (Punjab) లో భగవంత్ మాన్ ప్రభుత్వం తన మొదటి క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర పోలీసులో 10,000 ఖాళీలతో సహా వివిధ విభాగాల్లో 25,000 పోస్టుల భర్తీకిర్తీ ప్రకటన చేసింది. తొలి కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రా న్ని ఉద్దేశించి సీఎం వీడియో సందేశంలో మాట్లాడుతూ, ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే ఇస్తామని, రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎలాంటి వివక్ష, పక్షపాతంచూపబోమని చెప్పారు.

    Jobs in AP: నెల్లూరు జీఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ. 17,500.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

    కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌ద్దీక‌ర‌ణ‌..
    పంజాబ్ ప్రభుత్వం 35,000 మందికి పైగా గ్రూప్ సీ - గ్రూప్ డీ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీ క‌రిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలోనే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యో గులను నియమించుకునే విధానానికి స్వ స్తి పలకాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులను ఆదేశించినట్లు మాన్ తెలిపారు. "పాఠశాలలకు ఉపాధ్యాయులు లేరని.. అయితే అర్హులైన ఉపాధ్యాయులు తమ సేవలను క్రమబద్ధీకరించనందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Job notification, Punjab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు