Home /News /jobs /

JOB NEWS DOING JOB TRIALS HUGE OPENINGS IN A LEADING SOFTWARE COMPANY DETAILS EVK

Job News: జాబ్ ట్ర‌య‌ల్స్ చేస్తున్నారా.. ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ ఓపెనింగ్స్‌.. వివ‌రాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Capgemini Recruitment | ప్రముఖ ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & కన్సల్టింగ్ కంపెనీ క్యాప్‌జెమినీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ తాజాగా ఎక్సెల్లర్ డైవర్సిటీ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌ (Exceller Off-Campus Drive)ను ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  ప్రముఖ ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & కన్సల్టింగ్ కంపెనీ క్యాప్‌జెమినీ (Capgemini) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ తాజాగా ఎక్సెల్లర్ డైవర్సిటీ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌ (Exceller Off-Campus Drive)ను ప్రకటించింది. ఈ డ్రైవ్‌లో భాగంగా 2019/20/21 సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించిన టెక్నికల్/మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనుంది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ప్రస్తుతం ఉద్యోగ దరఖాస్తులను (Job Registrations) క్యాప్‌జెమినీ ఆహ్వానిస్తుంది. ఈ జాబ్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  ఎక్సెల్లర్ డైవర్సిటీ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌లో ఆఫర్ చేసే జాబ్స్ ప్రస్తుతం మహిళా అభ్యర్థులకు (Female Candidates) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ కోసం కంపెనీ త్వరలో చేపట్టే నియామకాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జాబ్స్ కోసం మహిళా అభ్యర్థులు 2019/2020/2021లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎంసీఏ, బీఈ/ బీటెక్, ఎంఈ / ఎంటెక్/ ఎమ్మెస్సీ (MSc) గ్రాడ్యుయేట్లు ఈ జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ ప్రక్రియకు హాజరయ్యే సమయంలో అభ్యర్థికి ఎలాంటి బ్యాక్‌లాగ్ (Backlog) ఉండకూడదు. ఇండియాలోని క్యాప్‌జెమిని ఆఫీస్ లొకేషన్‌లలో మీకు ఎందులోనైనా డ్యూటీ పడొచ్చు. కంపెనీ చెప్పినట్టుగా మీరు అక్కడికి వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. అవసరమైతే షిఫ్ట్‌లలో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. చేరే సమయంలో సర్వీస్ లెవెల్ ఒప్పందంపై సంతకం చేయాలి.

  Jobs in Telangana: రంగారెడ్డి జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

  “Exceller, Capgemini ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ టెక్నికల్ విద్యార్థులు ఎంచుకున్న టెక్నాలజీ రంగంలో రాణించడానికి, వారి కెరీర్‌లో విజయ శిఖరాన్ని చేరుకోవడానికి అనేక అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. Capgemini Exceller కింద, మేం దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, గ్రాడ్యుయేట్ కాలేజీల్లోని అత్యుత్తమ ప్రతిభావంతులను మా వర్క్‌ఫోర్స్‌లో నియమించుకుంటాం." అని కంపెనీ తెలిపింది.

  "క్యాప్‌జెమినీ ఎంబీఏ ప్రోగ్రామ్‌లు టెక్నాలజీపై అభిరుచి ఉన్న భారతదేశంలోని ప్రీమియర్ B-స్కూల్స్‌లో మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లను నియమించడం.. వేగంగా మారుతున్న టెక్ ప్రపంచంలో నావిగేట్ చేయడానికి విద్యార్థులను సన్నద్ధం చేయడంలో శిక్షణ అందిస్తోంది." అని కంపెనీ చెప్పింది. క్యాప్‌జెమినీ ఇండియాలో చేరిన ఉద్యోగులు తాము అనుకున్న భవిష్యత్తును క్రియేట్ చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం, క్యాప్‌జెమినీలో బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూర్, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, నోయిడా, పూణే, సేలం, తిరుచిరాపల్లిలో 150,000 మంది పని చేస్తున్నారు.

  మరిన్ని వివరాల కోసం, ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి ఇక్కడ క్లిక్ (https://app.joinsuperset.com/join/#/signup/student/jobprofiles/0e71f3ee-dbd6-4a71-ace9-0ce52c5ef504) చేయండి. మార్చి 31, 2022 నాటికి, క్యాప్‌జెమినీ గ్రూప్ మొత్తం 340,700 ఉద్యోగులను నియమించుకుంది. ఇది సంవత్సరానికి 24 శాతానికిపైగా పెరిగింది. ఆఫ్‌షోర్ కేంద్రాలలో శ్రామికశక్తి 31 శాతం పెరిగి 198,900కి చేరుకుంది. ఈ అతి పెద్ద కార్పొరేట్ కంపెనీలో చేరి మీ కెరీర్ బిల్డప్ చేసుకునేందుకు త్వరగా దరఖాస్తు చేసుకోండి.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: IT jobs, JOBS, Private Jobs

  తదుపరి వార్తలు