Home /News /jobs /

JOB NEWS DEGREE AND DRIVER JOB PG AND CONSTABLE INTERESTING ASPECTS IN POLICE JOBS APPLICATION EVK

Job News: డిగ్రీ చేసి డ్రైవర్ ఉద్యోగం.. పీజీ చదివి కానిస్టేబుల్.. పోలీస్ జాబ్స్ ద‌ర‌ఖాస్తుల్లో ఆస‌క్తిక అంశాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Telangana Police Jobs | తెలంగాణ‌ (Telangana) లో యూనిఫాం జాబ్స్ అప్లికేష‌న్ ప్రాసెస్ (Application Process) ముగిసింది. సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేశాయి. తాజాగా ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగిసింది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ‌ (Telangana) లో యూనిఫాం జాబ్స్ అప్లికేష‌న్ ప్రాసెస్ (Application Process) ముగిసింది. సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేశాయి. తాజాగా ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగిసింది. ఈ సారి ద‌ర‌ఖాస్తు వివ‌రాల్లో ప‌లు ఆస‌క్తికర విష‌యాలు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు అర్హత ఐటీఐ అయినా.. డిగ్రీ చేసిన అభ్య‌ర్థులు ఎక్కువ‌మంది ద‌ర‌ఖాస్తు చేసుకొన్నారు. ఇంట‌ర్ అర్హ‌త ఉన్న‌ కానిస్టేబుల్ జాబ్స్‌కు పోస్టుగ్రాడ్యుయేట్ అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకొన్నారు. ఎస్సై ఉద్యో గాలకైతే ఎం టెక్.. ఎంఫిల్ వంటి ఉన్న‌త విద్య అభ్య‌సించిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

    UPSC Civil Services result: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల..సెల‌క్ట్ అయిన‌ తెలుగు విద్యార్థులు వీరే!

    రాష్ట్రంలో పోలీస్‌, ఎక్సైజ్‌, జైళ్లు, రవాణా, అగ్నిమాపకశాఖల్లో మొత్తం 17,516 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా.. 7,33,559 అభ్యర్థులు మొత్తంగా 12,91,006 దరఖాస్తులు సమర్పించారు.

    Drone Pilot: డ్రోన్ పైలెట్ అవ్వ‌డం ఎలా.. 2025 నాటికి దేశంలో శిక్షణకు 150 స్కూల్స్!

    ఇందులో అత్యధికంగా 51% దరఖాస్తులు బీసీ వర్గాల నుంచి వ‌చ్చాయి. మొత్తం ద‌ర‌ఖాస్తుల్లో సివిల్ లేదా అం దుకు సమానమైన పోస్టుల విభాగం లో 2,16,738 మం ది గ్రాడ్యు యేట్లు, గ్రాడ్యు యేషన్ సమాన
    అర్హత కలిగిన 2,985 మంది, పీజీ చేసిన 2,7266 మంది, 568 మంది ద‌ర‌ఖాస్తు చేశారు. ఇక కానిస్టేబుల్ పోస్టులకు ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో సంబంధిత అంశాల్లో ఐటీఐ చదివిన 6,668 మంది, ఒకేషనల్ ఇంటర్ చదివిన 1,457 మంది దరఖాస్తు చేశారు. 13,837 మంది అర్హ‌త‌కు మించిన విద్యార్హ‌త ఉన్న‌వారు పోటీ ప‌డుతున్నారు.

    Ts Jobs: నిరుద్యోగుల‌కు మ‌రో గుడ్ న్యూస్‌.. 13,000 పోస్టుల‌తో ఆ శాఖ‌లో నోటిఫికేష‌న్‌

    ప‌లు విభాగాల్లో మెకానిక్ విభాగం లో ఐటీఐ చేసిన 3,691 మం ది, అం తకం టే ఎక్కు వ విద్యా ర్హత కలిగిన 1,527 మంది పోటీ పడుతున్నారు. ఈ విభాగంలో 10 దరఖాస్తులు అసం పూర్తిగా ఉన్న ట్లు గుర్తిం చారు. డ్రైవర్ పోస్టులకు ఐటీఐ చేసిన 3,034 మంది, ఇం టర్ చదివిన 19,170 మంది ఉన్నారు. అర్హ‌త‌కు మించిన విద్యా ర్హత కలిగిన వారు 4,791మంది అప్లై చేశారు. ఇక అగ్నిమాపక శాఖ డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల కోసం హెచ్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న‌వారితోపాటు ఉండటంతోపాటు ఐటీఐ చదివిన 1,282 మంది, ఇంటర్ పూర్తయిన 7,415 మంది, అధిక విద్యార్హత కలిగిన 2,237 మంది దరఖాస్తు చేశారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Job notification, Jobs in telangana, Police jobs, Telangana police jobs, Ts jobs

    తదుపరి వార్తలు