Home /News /jobs /

JOB NEWS BIHAR COACHING INSTITUTE OFFERING ONLY COST OF RS 2 COACHING FOR GOVERNMENT EXAMS EVK

Job news: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. అక్కడ ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల‌కు కోచింగ్‌ ఫీజు కేవ‌లం రూ.2 మాత్రమే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Govt Jobs Coaching | కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌లు విడుద‌ల చేస్తుంటాయి. వీటి కోసం చాలా మంది కోచింగ్ బాట ప‌డుతుంటారు. చాలా మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం ఓ కోచింగ్ సెంట‌ర్ ఏం స్కీం ప్ర‌వేశ‌పెట్టిందో తెలుసా..

ఇంకా చదవండి ...
  కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌లు విడుద‌ల చేస్తుంటాయి. వీటి కోసం చాలా మంది కోచింగ్ బాట ప‌డుతుంటారు. చాలా మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. కోచింగ్ సెంటర్లు భారీగా ఫీజులు వసూలు చేస్తుండడమే ఇందుకు కారణం. దీంతో స్పందించిన అనేక మంది ప్రజా ప్రతినిధులు నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే త‌క్కువ ధ‌ర‌కు కోచింగ్ సెంట‌ర్‌లు ట్రైనింగ్ ఇవ్వ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి.

  Jobs in Hyderabad: ఐడీఆర్‌బీటీలో ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ.1,01,500.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

  అయితే బీహార్‌ (Bihar) లో ప్ర‌భుత్వం కూడా ప‌లు పోస్టుల భ‌ర్తీకి ప‌చ్చ‌జెండా ఊపింది. ఈ నేప‌థ్యంలో బిహార్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ పరీక్షలకు సన్న ద్ధమవుతున్న విద్యా ర్థులకు ఓ కోచింగ్ సెంట‌ర్ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. అక్క‌డ పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యం లో రూ.2కే రివిజన్ తరగతులను అం దుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విష‌యాన్ని ఆఫీసర్స్ అకాడమీ కోచింగ్ ఇన్స్టిట్యూ ట్ డైరెక్టర్ సౌరభ్ శర్మ ప్ర‌క‌టించారు.

  అంతే కాకుండా విద్యార్థుల‌కు మ‌రో ఆఫ‌ర్ కూడా ఇచ్చారు. ఆసక్తి గల అభ్యర్థులు ప్లే స్టోర్ నుం చి ఇన్స్టిట్యూ ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లేదా వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని ఆన్‌లైన్ క్లాస్‌లు వినొచ్చ‌ని తెలిపారు. దీని ద్వారా కోచింగ్ సెంట‌ర్‌ల‌కు రాలేని వారు సైతం క్లాస్‌లు వినేలా ఏర్పాటు చేస్తున్న‌ట్టు సంస్థ తెలిపింది. చాలా మంది విద్యార్థులు దీనిపై ఆస‌క్తి చూపుతున్న‌ట్టు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

  TSPSC Exams: గ్రూప్స్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు ప్రారంభం

  ఇప్పటి వరకు ఈ ఆన్‌లైన్ ఆప్ష‌న్‌కు 4 వేల మంది నమోదు చేసుకున్నట్లు కోచింగ్ సెంట‌ర్‌పేర్కొన్నారు. అంతే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ‘వైభవ్ 30’ పేరుతో ఓ కోర్సును ప్రారంభిం చనున్నట్లు తెలిపారు. ఆ విద్యార్థులు ఇన్స్టిట్యూ ట్ నిర్దేశిం చిన ఓ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉం టుం దని వెల్లడించారు. ఇప్పుడు ఈ కోచింగ్ సెంట‌ర్ నిర్వ‌హిస్తున్న ఈ ప‌థ‌కం.. బీహార్‌లో హాట్ టాపిక్‌గా సాగుతోంది. చాలా మంది విద్యార్థులు దీనికి ఆక‌ర్షితులు అవుతున్నారు.

  తెలంగాణ‌లో ఉచితంగా భోజనం..
  తెలంగాణ (Telangana) ప్రభుత్వం భారీ ఉద్యోగ ప్రకటనకు సిద్ధమైంది. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలను భారీ సంఖ్యలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో అన్ని శాఖ‌ల్లో క‌లిపి 80,000ల‌కు పైగా ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నేపథ్యంలో ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉన్న అభ్యర్థులందరూ తమ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు.

  Gurukula Admission: గురుకుల అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడ‌గింపు.. ఎప్ప‌టి వ‌ర‌కు అంటే
   ఈ క్రమంలోనే ప‌లు జిల్లాల్లో నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు ఉచిత కోచింగ్ అందిస్తున్నారు. పీర్జాదిగూడలోని బుధా నగర్‌లోని సాయిబాబా ఆలయ కమ్యూనిటీ హాల్‌లోని ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించింది. అక్క‌డ‌ ప్రస్తుతం, 600 మందికి పైగా విద్యార్థులు రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి, విజయం సాధించడానికి తెలుగు, ఇంగ్లీషులో శిక్షణ పొందుతున్నారు. నిరుద్యోగుల‌కు ఉచిత‌ శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించడమే కాకుండా ఉచిత భోజనం, స్నాక్స్ అందిస్తోంది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Bihar, Govt Jobs 2022, Preparation

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు