హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela In Hyderabad: హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 80 కంపెనీల్లో 7 వేల జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Job Mela In Hyderabad: హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 80 కంపెనీల్లో 7 వేల జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

జాబ్ మేళా ప్రకటన

జాబ్ మేళా ప్రకటన

తెలంగాణలో భారీ జాబ్ మేళా (Job Mela) జరగనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Shamshabad

    తెలంగాణలో భారీ జాబ్ మేళా (Job Mela) జరగనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ (Telangana) ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలోని శంషాబాద్ లో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్ మేళాను శంషాబాద్ లోని మల్లికా ఏసీ కన్సెన్షన్ లో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు.


    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    ఈ జాబ్ మేళా ద్వారా 80కి పైగా ప్రముఖ కంపెనీల్లో 7000లకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగులు కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించబడునని ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర ఏదైనా సందేహాలుంటే 9030047304 (Only Whatsapp), 7097655912 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

    TSPSC Notification: నిరుద్యోగులకు శుభవార్త.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్.. వివరాలివే




    ఇదిలా ఉంటే.. ఇండియన్ ఆర్మీ (Indian Army) టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(TES)లోని 10+2 ఎంట్రీ స్కీమ్-48 కోర్సు పోస్టుల భర్తీకి వివాహం కాని పురుష అభ్యర్థుల(Male Candidates) నుంచి దరఖాస్తుల (Applications)ను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న వారు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.



    రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, సెప్టెంబర్ 21న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 90 ఖాళీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 22, 2022 ఆన్‌లైన్ అప్లికేషన్ ముగింపు: సెప్టెంబర్ 21, 2022. ఖాళీల వివరాలు 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) 48 కోర్సు: 90 ఖాళీలు

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Hyderabad, Job Mela, JOBS, Private Jobs

    ఉత్తమ కథలు