ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శభవార్త చెప్పింది. ఈ నెల 15న మరో జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి శ్రీకాకుళంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ కియా ఇండియా సంస్థతో పాటు, BSCPL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
BSCPL Infrastructure Ltd: ఈ సంస్థల్లో 55 ఖాళీలు ఉన్నాయి. సూపర్ వైజర్, అకౌంట్స్&ఇన్వెంటరీ, ఇంటర్నల్ ఆడిటర్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఐటీఐ, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, సీఏ-ఇంటర్, CMA-Inter, CA&CMA విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే.. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు దారుల వయస్సు 19 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా రూ.11 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు మహారాష్ట్ర , ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పని చేయాల్సి ఉంటుంది.
@AP_Skill has Conducting Mini Job Drive at Nehru Yuva Kendram, Balaga Road @srikakulamgoap
For more details on eligibility visit https://t.co/6H36uSCzUI Contact: Venkataramana - 9703698427 Surya - 9704960160 APSSDC Helpline : 99888 53335 pic.twitter.com/Hhod6SnLr1 — AP Skill Development (@AP_Skill) November 12, 2022
KIA Motors: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. Neem Trainee విభాగాంలో ఈ ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/బీ.టెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2019-2022 వరకు పాసై ఉండాలి. అయితే.. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనంతో పాటు 2 వేల అటెండెన్స్ బోనస్ ఉంటుంది. ఎంపకైన వారు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 15న నెహ్రూ యువ కేంద్రం, బలాగా రోడ్, ఆర్టీసీ బస్టాండ్, శ్రీకాకుళం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9703698427, 9704960160 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, JOBS, Private Jobs