ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. డిసెంబర్ 1న భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళాను కర్నూల్ జిల్లాలోని గూడూరులో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registrations) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కియా మోటార్స్ (Kia Motors), జియో మార్ట్ (Jio Mart), ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance), అమర రాజా బ్యాటరీస్ శ్రీరామ్ చిట్స్ తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి.
ఖాళీల వివరాలు:
కియా మోటార్స్ (KIA Motors):
ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/బీటెక్ చేసిన వారు అప్లై చేుకోవచ్చు. ఎంపికైన వారు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.16 వేలు. వయస్సు 18-27 ఏళ్లు.
AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే
జియో మార్ట్ (Jio Mart):
ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వేతనం రూ.11 వేల నుంచి రూ.16 వేల వరకు ఉంటుంది. అభ్యర్థులు అదోని, ఎమ్మిగనూర్, కర్నూల్, నంద్యాలలో పని చేయాల్సి ఉంటుంది.
అమర్ రాజా (Amararaja):
ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 16-25 ఏళ్లు ఉండాలి.
@AP_Skill has Conducting Job Mela at Government Junior College #Gudur @kurnoolgoap Registration Link: https://t.co/EVvSzGFjHN pic.twitter.com/zHAo6AYZIe
— AP Skill Development (@AP_Skill) November 28, 2022
ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance):
ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వేతనం రూ.10 వేల నుంచి రూ.17 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు కర్నూల్, నంద్యాల జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు:
అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్టర్ చేసుకున్న వారికి డిసెంబర్ 1న ఉదయం 9 గంటలకు గవర్నమెంట్ జూనియయర్ కాలేజీ, గూడూరు చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
ఇతర పూర్తి వివరాలకు 9642735717, 9703993995 నంబర్లను సంప్రదించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Job Mela, JOBS, Private Jobs