Home /News /jobs /

JOB MELA IN AP FOR VARIOUS JOB VACANCIES AT AUTOMOTIVE MANUFACTURES PVT LTD HERE REGISTRATION LINK NS

AP Job Mela: ఏపీలో ఈ రోజు మరో జాబ్ మేళా.. ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఆంధ్రప్రదేశ్ లో మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ఏపీ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. Automotive Manufactures Pvt Ltd (Ashok Leyland) సంస్థలో ఖాళీల భర్తీకి ఈ రోజు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం మండలం, వెలుగుబండ గ్రామం సమీపంలోని GIET కాలేజీ సమీపంలోని సంస్థ ప్రాంగణంలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    Mechanic/Helper విభాగంలో మొత్తం 30 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. ఐటీఐ-డిజిల్ మెకానిక్/మోటార్ మెకానిక్/ఫిట్టర్/ఎలక్ట్రీషియన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్లు/అనుభవం కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనంతో పాటు ఆకర్షణీయమైన ఇన్సెంటీవ్స్ ఉంటాయి.
    AP Govt Jobs: ఏపీలో కొత్తగా 3530 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలివే..!



    ఇతర వివరాలు:
    - అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు Automotive Manufactures Pvt Ltd, 3-410, Near GIET College, Velugubanda Village, Rajanagaram Mandal, East Godavari District, 533294 చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో స్పష్టం చేశారు అధికారులు.
    - టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ఆధారంగా అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఎంపికైన వారు రాజమండ్రి, తాడేపల్లిగూడెం, కాకినాడ, పోలవరంలో పని చేయాల్సి ఉంటుంది.
    - ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాన్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9848304785 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job Mela, Job notification, JOBS

    తదుపరి వార్తలు