AP Job Mela: ఏపీలో మరో భారీ జాబ్ మేళా.. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో జాబ్స్.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. TCL, Raising Stars, Hero Moto Corp, Teck Team Solutions, Wheels Mart తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి ప్రకటన విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ వారి విద్యార్హతలకు తగిన ఉద్యోగాలను అందించేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు వివిధ ప్రవేట్ సంస్థల్లో ఖాళీల భర్తీకి APSSDC నుంచి వరుసగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. భారీగా జాబ్ మేళాలను సైతం నిర్వహిస్తోంది APSSDC. తాజాగా APSSDC నుంచి మరో జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. TCL, Raising Stars, Hero Moto Corp, Teck Team Solutions, Wheels Mart సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.



























    Company Name Vacancies
    TCL 100
    Raising Stars 100
    Hero Moto Corp 100
    Teck Team 5
    Wheels Mart 90

    Educational Qualifications-
    -TCL సంస్థలో అసెంబ్లీ/రీ వర్క్/టెస్టింగ్ సెక్షన్ లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.12014 వేతనంతో పాటు ఉచితంగా భోజనం, వసతి, రవాణ సదుపాయం కల్పించబడుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    -Raising Stars సంస్థలో అసెంబ్లిగ్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-32 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 10, 200 వరకు వేతనం చెల్లించనున్నారు. ఉచిత భోజనం, వసతి సదుపాయం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది.
    NIOT Recruitment 2021: రూ.78,000 వరకు వేతనంతో 237 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయితే చాలు

    -Hero Moto Corp సంస్థలో ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ(పురుషులు), ఇంటర్(స్త్రీలు) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 14,977 వేతనం ఉంటుంది. శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది.
    Teck Team సంస్థలో టెక్నికల్ ట్రైనర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/బీటెక్ ఈసీఈ(ఫ్రెషర్స్) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ. 1.2 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 26 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన వారు విజయనగరంలో పని చేయాల్సి ఉంటుంది.
    -Wheels Mart సంస్థలో సేల్స్, కలెక్షన్, ఎగ్జిక్యూటీవ్స్, అకౌంటెంట్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 19 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం, విజయనగరంలో పని చేయాల్సి ఉంటుంది.
    IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ సంస్థలో 480 ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీల వివరాలివే


    Registration Link:  https://apssdc.in/home/
    Interview Date:
    ఆగస్టు 31, ఉదయం 10 గంటలు
    Interview Venue: ఆర్.కే జూనియర్ కాలేజీ&డిగ్రీ కాలేజీ(ఆర్.కే ప్యాలస్ మయూరీ జంక్షన్)-విజయనగరం జిల్లా
    Contact Numbers: 7989826953, 9000102013
    Published by:Nikhil Kumar S
    First published: