హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఎల్లుండి మరో భారీ జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఎల్లుండి మరో భారీ జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 18న మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 18న మరో జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో దాదాపు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో దాదాపు వేయి ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీలు విద్యార్హతల వివరాలు:

BYJUS: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ, బిజినెస్ డవలప్మెంట్ అసోసియేట్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.8 లక్షల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి.

Reliance Jio Infocomm Ltd: ఈ సంస్థలో మరో 100 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1,40,000 నుంచి రూ. 5 లక్షల వేతనం ఉంటుంది. ఎంపికైన వారు విజయవాడ , పోరంకి, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడులో పని చేయాల్సి ఉంటుంది.

Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో మరో 120 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వేతనం ఉంటుంది. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.

BEL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. భారత్ ఎలక్ట్రానిక్స్ లో జాబ్స్ .. దరఖాస్తుకు మరో వారమే ఛాన్స్

దీంతో పాటు మరో ఏడు సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు ఏపీ/టీఎస్ లో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.

ఇతర వివరాలు:

- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న వారు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు KBN కాలేజ్, 9-42-104, KT Road, Opp.శ్రీనివాస మహల్, కొత్తపేట, విజయవాడ చిరునామాలో ఈ నెల 19 ఉదయం 9 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- అభ్యర్థులు Resume కాపీలు, డాక్యుమెంట్లు వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

- ఇతర వివరాలకు 9603368324, 9700092606 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు