ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వరంలా మారింది. పలు ప్రైవేట్ సంస్థల్లో ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ మేళాలను (Job Mela) నిర్వహిస్తోంది APSSDC. తాజాగా ప్రముఖ వరుణ్ మోటార్స్ (బజాజ్ డివిజన్) లో ఖాళీల భర్తీకి జాబ్ మేళా ప్రకటన విడుదల చేసింది. ఈ జాబ్ మేళా ద్వారా 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ జాబ్ మేళా ద్వారా వరుణ్ మోటార్స్ లో టెలీకాలర్స్ విభాగంలో 5 ఖాళీలు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్స్ విభాగంలో 30 ఖాళీలు, క్యాషియర్స్ విభాగంలో 2 ఖాళీలు, అకౌంట్స్ విభాగంలో 2, ఆడిట్ విభాగంలో 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఎంపికైన వారు యలమంచిలి, అనకాపల్లి, పాయకరావుపేట, తాల్లపాలెం, అచంటపాలెంలో పని చేయాల్సి ఉంటుంది.
AP TET 2022 Results: ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. రిజల్ట్, ఫైనల్ కీ విడుదలపై కీలక అప్‌డేట్..
@AP_Skill has Collaborated with #VarunMotorsPvtLtd to Conduct Industry Customized Skill Training & Placement Program #AnakapalliDistrict For more details on eligibility visit https://t.co/Xnrotggdpb Contact: Mr.Vamsi - 94924 29425 APSSDC Helpline : 99888 53335 pic.twitter.com/Fstmc7nVq4
— AP Skill Development (@AP_Skill) September 9, 2022
ఇతర వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారికి టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, బ్యాంక్ పాస్ బుక్, ఆధార్, పాన్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
-రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు SGA గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, యలమంచిలి, అనకాపల్లి జిల్లా చిరునామాలో ఈ నెల 14న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9492429425 నంబర్ ను సంప్రదించాలని సూచించారు అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Job Mela, JOBS, Private Jobs