JOB MELA IN AP FOR JOB VACANCIES AT VARUN MOTORS ON JAN 20 HERE REGISTRATION LINK NS
Varun Motors Job Mela in AP: టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో వరుణ్ మోటార్స్ లో జాబ్స్.. రూ. 13 వేల వరకు వేతనం.. ఇలా అప్లై చేయండి
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రేపు జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి పలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల(Jobs) భర్తీకి ఇటీవల వరుసగా ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించి APSSDC ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ వరుణ్ మోటార్స్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 20న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు.. Asst. Technician: ఈ విభాగంలో మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ(Diesel, Fitter, Electrician, Diploma Mechanical) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 9500 వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ సైతం చెల్లించనున్నారు. Service Advisors: ఈ విభాగంలో మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా మెకానిక్ అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.9500 వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. Accessories Fitter: 10 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఫిట్టర్, టెన్త్/ఇంటర్ అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. వేతనం రూ.9500+ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. Railway Recruitment 2022: టెన్త్ పాసైన వారికి రైల్వేలో జాబ్స్.. జీతం రూ. 25 వేలు.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్
Sales Advisors: టెన్త్, ఇంటర్ తో పాటు ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి. Evaluators: మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా మెకానిక్ అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. Drivers: టెన్త్ పాసైన వారు ఈ విభాగంలోని 5 ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 13 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు.
వయస్సు: పై అన్ని ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పరుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. NIRDPR Recruitment 2022: హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
ఇతర వివరాలు:అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
-రిజిస్ట్రేషన్ చేసుకున్నఅభ్యర్థులు 40-1-126, వరుణ్ మోటార్స్(వరుణ్ బజాజ్), బెంజ్ సర్కిల్, పెట్రోల్ బంక్ పక్కన, విజయవాడ, సీఆర్డీఏ రీజియన్ చిరునామాలో ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
-టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
-ఎంపికైన అభ్యర్థులు విజయవాడ, నందిగామ, కేసరపల్లి, మైలవరం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నూజివీడు, మచిలీపట్నం చిరునామాలో పని చేయాల్సి ఉంటుంది.
సేల్స్ అడ్వైజర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి టూవీలర్ తో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
-ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9502757755, 8919951682 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.