Home /News /jobs /

JOB MELA IN AP FOR JOB VACANCIES AT KIA MOTORS AIRTEL AND OTHER COMPANIES HERE FULL DETAILS NS

Job Mela in AP: ఏపీలో నేడు భారీ జాబ్ మేళా.. KIA Motors, Airtel సంస్థల్లో ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్, బీటెక్, డిప్లొమా చేసిన వారికి ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ మేళాకు(Job Mela) సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి ఇటీవల వరుసగా జాబ్ మేళా(Job Mela) లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించిన ప్రకటనను APSSDC విడుదల చేసింది. కియా యోటార్స్, RSMIPL, Airtel Payments Bank తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు (Job Interviews) నిర్వహిస్తున్నట్లు తెలిపింది. టెన్త్, ఇంటర్, బీటెక్, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    KIA Motors India Pvt Ltd: ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. డిప్లొమా, బీటెక్(All Trades) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 14 వేలతో పాటు రూ. వేయి వరకు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు అనంతపూర్ లో పని చేయాల్సి ఉంటుంది.
    Bharat FIH(Rising Star Mobiles): ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 12,328 వేతనం చెల్లించనున్నారు. దీంతో పాటు ఫుడ్ మరియు వసతి సదుపాయం ఉంటుంది. కేవలం స్త్రీలు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు Sricityలో పని చేయాల్సి ఉంటుంది.
    Hyderabad Mega Job Mela: నిరుద్యోగులకు అలర్ట్.. హైదరాబాద్ లో నేడు మెగా జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

    Kutumb Care(Airtel Payment Bank): ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. Retailer/Sales Officer విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 13 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు నెల్లూరులో పని చేయాల్సి ఉంటుంది.
    UPSC CISF Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్

    ఇతర వివరాలు..
    అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సిఉంటుంది.
    ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్, ఆధార్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
    అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు శ్రీనివాస్-8790813132, 7780289591 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.



    ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు Rao's Degree & PG College, Beside Leelamahal, VRC Centre - Nellore చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: AIRTEL, Andhra Pradesh, Job Mela, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు