Home /News /jobs /

JOB MELA IN AP APPLICATIONS INVITING FOR JOB VACANCIES AT PFIZER HEALTHCARE INDIA PRIVATE LTD HERE FULL DETAILS NS

Jobs in AP: ఏపీలో ఈ రోజు జాబ్ మేళా.. రూ.15 వేల వేతనంతో ఉద్యోగాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి చాలా రోజుల తర్వాత మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. Pfizer Healthcare India Private Ltd సంస్థలో ఖాళీల (Jobs) భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    Pfizer Healthcare India Private Ltd సంస్థలో జూనియర్ అసోసియేట్ విభాగంలోని 60 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తి చేయనున్నారు. డిప్లొమా(మెకానికల్/ఫార్మసీ/ఎలక్ట్రికల్/కెమికల్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15,816 వేతనం చెల్లించనున్నారు. టెక్నికల్ ఇంటర్వ్యూ, ఎగ్జామ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విశాఖలోని పర్వాడలో పని చేయాల్సి ఉంటుంది.
    Salary Hike: నైపుణ్యాల వృద్ధి కారణంగా భారీగా పెరిగిన ఉద్యోగుల జీతాలు.. సర్వేలో ఆసక్తికర విషయాలు..



    ఇతర వివరాలు:
    -అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, Biodata, ఆధార్, విద్యార్హతల సర్టిఫికేట్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు Avanthi Institute of Engineering & Technology University , Cherukupally (P), Bhogapuram (M), Near Tagarapuvalasa, NH16, Kotabhogapuram, AP-535006 చిరునామాలో నిర్వహించున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
    -ఇతర పూర్తి వివరాలకు 9959377669, 7661872926 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, JOBS, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు