ఆంధ్రప్రదేశ్ లో మరో జాబ్ మేళాను APSSDC ప్రకటించింది. ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహింద్ర సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఇటీవల రాష్ట్రంలో వరుసగా జాబ్ మేళాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ మరో జాబ్ మేళాను (Job Mela) ప్రకటించింది. తాజాగా టెక్ మహీంద్రా (Tech Mahindra) సంస్థలో 300 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ఖాళీలు, అర్హతల వివరాలు..
కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ - బ్యాంకింగ్: ఈ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులు చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎంపికైన వారికి ఏడాదికి రూ. 1.80 లక్షల నుంచి రూ.2.80 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. TCS Jobs 2022: ఆ కోర్సు పాస్ అయినవారికి మరో ఛాన్స్... టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండిలా
కస్టమర్ సర్వీస్ ప్రాసెస్-(Tamil):ఈ విభాగంలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. 10+2 లేదా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా తమిల్ మాట్లాడగలగాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.80 లక్షల వేతనం తో పాటు 2 వేల బ్రేక్ షిఫ్ట్ అలవెన్స్, 1000 ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. ఈ ఖాళీలకు ఎంపికైన వారు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. Career Advice: ఉద్యోగ వేట ప్రారంభించారా..? అయితే ఈ అంశాలను తప్పకుండా గుర్తుపెట్టుకోండి..
కస్టమర్ సర్వీస్ ప్రాసెస్-(కన్నడ):ఈ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. 10+2 లేదా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా కన్నడ మాట్లాడగలగాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ. 1.64 లక్షల వేతనం చెల్లించనున్నారు. ఇంకా 2 వేల బ్రేక్ అలవెన్స్ ఉంటుంది. ఇంకా రూ. 1000 ఇన్సెంటీవ్స్ చెల్లిస్తారు. Cognizant: ఫ్రెషర్స్‌కు కాగ్నిజెంట్ గుడ్‌న్యూస్.. నెలకు రూ.21 వేల జీతం.. దరఖాస్తు ఇలా చేయండి..
ఇతర వివరాలు:
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ https://apssdc.in/industryplacements/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-అనంతరం ఈ నెల 8వ తేదీన ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
-Vijetha Degree College, Officers Lane, Near RTC Buss stand, Chittor చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
-HR రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. -ఎంపికైన అభ్యర్థులు వారానికి ఆరు రోజులు పని చేయాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు ఇతర వివరాలకు 7799300659, 9505023026 నంబర్ ను సంప్రదించాలని నోటిఫికేషన్లో సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.