Home /News /jobs /

JOB MELA IN ANDHRA PRADESH ON JAN 6 FOR JOBS VACANCIES AT SPENCERS VISHAL MART HERE REGISTRATION DETAILS NS

AP Job Mela: ఏపీలో ఈ రోజు మరో జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ఏపీలో ఈ రోజు మరో జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ఏపీలో ఈ రోజు మరో జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా మరో జాబ్ మేళాకు సంబంధించి ప్రకటన చేసింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళా (Job Mela)కు హాజరు కావొచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ మేళా (Job Mela) కు సంబంధించిన ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో జాబ్ మేళాకు సంబంధించి APSSDC ప్రకటన విడుదల చేసింది. Spencer's, Vishal Mega Mart సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ నెల 6న జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీలు (Jobs), విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి.

    Spencers Retail Limited: ఈ సంస్థలో మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 18-26 ఏళ్లు ఉండాలి. పురుషులు, స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు కడపలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. ఇంకా ఎంపికైన వారికి ఏడాదికి రూ.9 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు.
    AP Tech Mahindra Job Mela: ఏపీలో మరో జాబ్ మేళా.. ఇంటర్, డిగ్రీ చదివిన వారికి టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు.. ఏడాదికి రూ.2.80 లక్షల వేతనం

    Vishal Mart: ఈ సంస్థలో 7 ఖాళీలు ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటీవ్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు కడపలో పని చేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    AP Govt Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

    ఇతర వివరాలు..
    -అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు. ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9398348760, 88997776368 నంబర్లను సంప్రదించాలని సూచించారు.



    ఇంటర్వ్యూ వేధిక: MGI Technologies, PMKVY Skill Center, Near Y Junction, Kadapa District. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ చిరునామాలో ఈ నెల 6వ తేదీన ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job Mela, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు