AP Job Mela: ఏపీలో మరో భారీ జాబ్ మేళా.. ఐదు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 9న మరో జాబ్ మేళా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ - APSSDC ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవల వరుసగా జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. తాజాగా మరో జాబ్ మేళాపై సంస్థ నుంచి ప్రకటన విడుదలైంది. Eruvaka Technologies Pvt Ltd, Amazon, SHRIRAM City, Hetero Drugs తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 9న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    Eruvaka Technologies Pvt Ltd: ఈ సంస్థలో మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్, ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటీవ్, లైన్ సూపర్వైజర్/హౌస్ కీపింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిప్లొమా/బీటెక్ ఎలక్ట్రానిక్స్&మెకానికల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనాలు చెల్లించనున్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 19-27 ఏళ్లు ఉండాలి.
    Amazon: ఈ సంస్థల్లో 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డెలివరీ బాయ్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ విద్యార్హత కలిగి డ్రైవింగ్ లైసెన్స్, సొంత బైక్, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనంతో పాటు పెట్రోల్ అలవెన్స్, ఇన్సెంటీవ్స్ అందించనున్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో సూచించారు. అభ్యర్థుల వయస్సు 18-20 ఏళ్లు ఉండాలి.
    Sriram City: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. మార్కెటింగ్ & రీకవరీ ఎగ్జిక్యూటీవ్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13,500 వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్+టీఏ+డీఏ చెల్లించనున్నారు. అయితే పురుషులు, స్త్రీలు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి.



    Caxton Facilities Management: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. మెషిన్ ఆపరేటర్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ/డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.
    Hetero Drugs: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ కెమిస్ట్/QA/QC/Helpers విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ/బీఎస్సీ/ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ. 18 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. పురుషులు, స్త్రీలు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి.

    ఇతర వివరాలు:
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఎంపికైన అభ్యర్థులు ప్రకాశం డిస్ట్రిక్ట్&హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9052202833 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published: