Andhra Pradesh: ఏపీలో భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ మరోసారి భారీ జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా మూడు ప్రముఖ సంస్థల్లో ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు APSSDC తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30న అనంతపూర్ లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ముందుగా APSSDC వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, హైదరాబాద్, అనంతపూర్ లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9010039901 నంబర్ ను సంప్రదించాలని నోటిఫికేషన్లో సూచించారు.
  BEL Recruitment 2021: మచిలీపట్నం బీఈఎల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. వివరాలివే

  ఖాళీలు విద్యార్హతల వివరాలు..
  -Needs Services Pvt Ltd(Amazon) సంస్థలో 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పికింగ్, ప్యాకింగ్, బార్ కోడ్ స్కానింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి. ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 13,140 వరకు వేతనం చెల్లించనున్నారు.
  -Fresh Minds సంస్థలో మొత్తం 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్స్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి.
  -FUTURZ(Flipkart): ఈ సంస్థలో మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పికింగ్, ప్యాకింగ్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. టెన్త్/ఇంటర్/డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వరకు వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 12-26 ఏళ్లు ఉండాలి. అయితే ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
  Registration - Direct Link  ఇతర వివరాలు:
  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30న ఉదయం పది గంటలకు నలంద డిగ్రీ కాలేజీ, రామ్ నగర్, అనంతపూర్ చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
  Published by:Nikhil Kumar S
  First published: