హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela: గుంటూరు నాగార్జున యూనివర్సిటిలో జాబ్ మేళా.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

Job Mela: గుంటూరు నాగార్జున యూనివర్సిటిలో జాబ్ మేళా.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Job Mela in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో  ఈనెల 23, 24 తేదీలలో గుంటూరు నాగార్జున యూనివర్సిటిలో ప్రాంగణంలో, జాబ్‌మేళా నిర్వహింస్తున్నారు.  

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh)  నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో  ఈనెల 23, 24 తేదీలలో విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో, జాబ్‌మేళా నిర్వహింస్తున్నారు.  క‌నీసం 5 వేల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో(Private Sector) కల్పించడం జరుగుతుందని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.   అంతే కాకుండా  ఈనెల 30, మే 1న గుంటూరులోని నాగార్జున యూనివర్సిటిలో జాబ్‌మేళా నిర్వహించబోతున్నాయి. మూడు చోట్ల కనీసం 5 వేల చొప్పున మొత్తం 15 వేల ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Jobs in Andhra Pradesh: ప‌లు జిల్లాల్లో ఉద్యోగ అవ‌కాశాలు.. ద‌ర‌ఖాస్తుకు రేప‌టితో ఆఖ‌రు తేదీ

విద్యార్హత..

10వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అర్హులైన వారంతా ఆయా జాబ్‌మేళాలకు హాజరు కావొచ్చని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, అభిమానులకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు.

దరఖాస్తు విధానం..

Step 1 - ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://ysrcpjobmela.com/ ను సంద‌ర్శించాలి.

Step 3 - మీరు వైజాక్‌, గుంటూర్ ద‌ర‌ఖాస్తు చేసుకోడానికి అవ‌కాశం ఉంటుంది.

Jobs in AP: నెల్లూరులో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. ఎటువంటి ప‌రీక్ష లేకుండా ఎంపిక‌

Step 4 - ఆయా తేదీల్లో Apply Now క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు మొద‌లు పెట్టాలి.

Step 5 - Full Name , Contact Number, Mail id ద్వారా ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి.

Step 6 - త‌ప్పులు లేకుండా నింపిన త‌రువాత‌.. స‌బ్‌మిట్ చేయాలి.

ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రు తేదీలు..

తిరుప‌తి - ఏప్రిల్ 16, 17

వైజాక్ - ఏప్రిల్ 23, 24

గుంటూర్ - ఏప్రిల్ 30, మే 1న ద‌ర‌ఖాస్తు చేసుకోవొచ్చు.

TS Jobs Coaching: నిరుద్యోగుల‌కు అలర్ట్.. ఉచిత శిక్ష‌ణ‌.. రూ.1,500 విలువైన స్ట‌డీ మెటీరియ‌ల్

హైద‌రాబాద్‌లోని కేంద్ర సంస్థ‌లో ఉద్యోగాలు..

హైద‌రాబాద్‌ (Hyderabad)లోని భార‌త ప్ర‌భుత్వం రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ డెవ‌లప్‌మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ అండ్ టెక్నాల‌జీ ( Institute for Development and Research in Banking Technology)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి  దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా పలు విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టులకు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల ఆధారంగా నెల‌కు వేత‌నం రూ.70,900 నుంచి రూ.1,01,500 వ‌ర‌కు చెల్లిస్తారు.  నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ గురించి తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్ https://www.idrbt.ac.in/careers.html ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఏప్రిల్ 18 , 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Job Mela, Private Jobs

ఉత్తమ కథలు