Jobs: ఈ రంగాల్లో ఉద్యోగాలు కష్టమే... తగ్గిపోతున్న నియామకాలు

Jobs | 2017 మార్చి నుంచి 2018 మార్చి నాటికి ఉపాధి అవకాశాలు 6.2 శాతం పెరిగాయి. కానీ 2019 మార్చి నాటికి 4.3% మాత్రమే ఉద్యోగాలు పెరిగాయి.

news18-telugu
Updated: August 20, 2019, 11:32 AM IST
Jobs: ఈ రంగాల్లో ఉద్యోగాలు కష్టమే... తగ్గిపోతున్న నియామకాలు
Jobs: ఈ రంగాల్లో ఉద్యోగాలు కష్టమే... తగ్గిపోతున్న నియామకాలు
news18-telugu
Updated: August 20, 2019, 11:32 AM IST
భారతదేశంలో నిరుద్యోగ పరిస్థితులు 45 ఏళ్ల గరిష్ట స్థాయిలో ఉన్నాయన్న వార్తలు కొంతకాలంగా కలకలం రేపుతున్నవే. చాలా రంగాల్లో నియామకాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ కంపెనీలు, ఆటోమేకర్స్, లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు నియమకాలను తగ్గించాయని కేర్ రేటింగ్స్ లిమిటెడ్ అధ్యయనంలో తేలింది. సుమారు 1000 కంపెనీల వార్షిక నివేదికల్ని పరిశీలించిన తర్వాత కేర్ రేటింగ్స్ ఈ అధ్యయనాన్ని బయటపెట్టింది. ఫైనాన్స్, రీటైల్, రియాల్టీ, ఐటీ ఇన్స్యూరెన్స్, మీడియా లాంటి సేవా రంగాల్లో మాత్రమే ఉద్యోగాల వృద్ధి బలంగా ఉందని కేర్ రేటింగ్స్ తేల్చింది. 2017 మార్చి నుంచి 2018 మార్చి నాటికి ఉపాధి అవకాశాలు 6.2 శాతం పెరిగాయి. కానీ 2019 మార్చి నాటికి 4.3% మాత్రమే ఉద్యోగాలు పెరిగాయి. ఏఏ రంగంలో ఉద్యోగాల కల్పన ఎలా ఉందో ఈ చార్ట్‌లో చూడండి.

jobs, Job creation, CARE Ratings on jobs, employment, hiring slowdown, new jobs, jobs india, ఉద్యోగాలు, ఉద్యోగాల కల్పన, కేర్ రేటింగ్స్, ఉపాధి, నియామకాలు, కొత్త ఉద్యోగాలు, జాబ్స్ ఇండియా

హాస్పిటాలిటీ రంగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు పెరుగుతున్నాయని కేర్ రేటింగ్స్ అధ్యయనంలో తేలింది. ఉత్పత్తి తగ్గిపోవడం, దివాళా లాంటి సమస్యల కారణంగా ఐరన్, స్టీల్, మైనింగ్ కంపెనీల్లో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ కొత్త ఉద్యోగాల కల్పన భారంగా మారింది. అందుకే బ్యాంకులు ఉద్యోగుల హేతుబద్ధీకరణతో పాటు ఔట్‌సోర్సింగ్ పైన ఆధారపడుతున్నాయి. మొత్తంగా చూస్తే గత రెండేళ్లతో పోలిస్తే 2018-2019 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల సృష్టి బాగా తగ్గిందని కేర్ రేటింగ్స్ అధ్యయనాన్ని బట్టి తెలుస్తోంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు


ఇవి కూడా చదవండి:
Loading...
HPCL Jobs: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

RRB Exam: ఆర్ఆర్‌బీ జేఈ పరీక్షల వివరాలు విడుదల... చెక్ చేసుకోండి ఇలా

Railway Jobs: మీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఫిర్యాదు చేయమంటున్న ఆర్ఆర్‌బీ
First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...