జనవరిలో 6.9 శాతం తగ్గిన ఉద్యోగాల కల్పన: ESIC డేటా

జనవరిలో 6.9 శాతం తగ్గిన ఉద్యోగాల కల్పన: ESIC డేటా

Job Creation in India | సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్(CSO) విడుదల చేసే పేరోల్ జాబితాలో ESIC డేటా కూడా ఒకటి. దీంతో పాటు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA) లెక్కల్ని కూడా పరిశీలిస్తాయి.

 • Share this:
  జనవరిలో ఉద్యోగాల కల్పన భారీగా తగ్గింది. 2018 జనవరి డేటాతో పోలిస్తే 2019 జనవరిలో 6.91 శాతం ఉద్యోగాలు తగ్గాయి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC తాజా లెక్కలివి. 2018 జనవరిలో 12.06 లక్షల మంది ESICలో నమోదు చేసుకున్నారు. 2019 జనవరిలో 11.23 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. ఈ లెక్కన గతేడాది జనవరితో పోలిస్తే ఈసారి 6.91 శాతం ఉద్యోగాలు తగ్గాయి. సెప్టెంబర్ 2017 నుంచి జనవరి 2019 మధ్య 2.08 కోట్ల మంది కొత్తగా ESIC పథకంలో చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. 20 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు, రూ.21,000 లోపు వేతనం ఉన్నవారి ఉద్యోగుల పేర్లను ESIC పథకంలో నమోదు చేస్తాయి. ఆ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, వైద్య సేవల్ని అందిస్తుంది ఈసీఐసీ.

  Read this: Food Safety Jobs: ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో 275 ఖాళీలు

  సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్(CSO) విడుదల చేసే పేరోల్ జాబితాలో ESIC డేటా కూడా ఒకటి. దీంతో పాటు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA) లెక్కల్ని కూడా పరిశీలిస్తాయి. ఈ మూడు సంస్థలు ఇచ్చిన డేటా ఆధారంగా సెప్టెంబర్ 2017 నుంచి ఉద్యోగుల లెక్కల్ని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్(CSO) విడుదల చేస్తోంది. EPFO డేటా ప్రకారం జనవరిలో సంఘటిత రంగంలో ఉద్యోగ కల్పన లెక్కలు 17 నెలల గరిష్టస్థాయికి 8.96 లక్షలకు చేరడం విశేషం. గతేడాది జనవరిలో ఈ లెక్క 3.87 లక్షలు మాత్రమే.

  Read this: UPSC Jobs 2019: పలు ఉద్యోగాలకు యూపీఎస్‌సీ నోటిఫికేషన్... వివరాలివే

  సెప్టెంబర్ 2017 నుంచి జనవరి 2019 వరకు 76.48 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు సామాజిక భద్రతా పథకాల్లో చేరారు. గత 17 నెలల్లో సంఘటిత రంగంలో సృష్టించిన కొత్త ఉద్యోగాలు ఇవి. 20 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థల్లో, బేసిక్ వేతనం రూ.15,000 లోపు ఉన్న వారిని సబ్‌స్క్రైబర్లుగా చేర్చుకుంటుంది ఈపీఎఫ్ఓ. ఇక సెప్టెంబర్ 2017 నుంచి జనవరి 2019 వరకు నేషనల్ పెన్షన్ స్కీమ్-NPS సబ్‌స్క్రైబర్లు 10,30,959.

  Photos: సముద్రంలో రెస్టారెంట్... ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  EPF Withdraw: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలా? నిబంధనలివే...

  IRCTC New Rule: ఇక 4 గంటల ముందు రైలు ఎక్కే స్టేషన్ మార్చుకోవచ్చు

  TRAI Deadline: ఛానెళ్ల ఎంపికకు మార్చి 31 డెడ్‌లైన్

  Twitter: ట్విట్టర్‌లో పాపులర్ సీఎం ఎవరో తెలుసా?
  First published: