ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా మంది విద్యార్థుల కల. అందు కోసం ఎన్నో ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతుంటారు. ఎస్‌బీఐ నుంచి మొదలుకొని ఎస్‌ఎస్‌సీ వరకు అనేక ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్(Notification) విడుదల చేశాయి. ఈ నెలలో అప్లై(Apply) చేసుకోవాల్సిన ఉద్యోగాలు ఏవో చూద్దాం.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) రిక్రూట్‌మెంట్- 2022
సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X-2022 కోసం ఎస్‌ఎస్‌సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూన్ 13లోపు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2065 పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆగస్టులో పరీక్ష నిర్వహించనున్నారు. బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* ఇండియన్ బ్యాంక్ ఎస్‌ఓ రిక్రూట్‌మెంట్ -2022
ఇండియన్ బ్యాంక్ SO (స్పెషలిస్ట్ ఆఫీసర్స్) పోస్టులైన సీనియర్ మేనేజర్‌లు, చీఫ్ మేనేజర్‌లు, మేనేజర్‌లు, అసిస్టెంట్ మేనేజర్ల పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తంగా 312 ఎస్‌వో పోస్టులు భర్తీ కానున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 14 లోపు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా CA పాసై ఉండాలి. లేకపోతే సంబంధిత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాసై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36,000 నుంచి రూ. 89,000 వరకు వేతనం లభించనుంది.
* ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్- 2022
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపదికన 641 పోస్టులను భర్తీ చేయడానికి SBI రిటైర్డ్ సిబ్బంది నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. SBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు జూన్ 7లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 503 ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్ - ఎనీటైమ్ ఛానెల్స్ (CMF-AC), 130 ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్ పోస్ట్‌లు- ఎనీటైమ్ ఛానెల్స్ (CMS-AC), 8 సపోర్ట్ ఆఫీసర్- ఎనీటైమ్ ఛానెల్స్ (SO-AC) పోస్టులను భర్తీ కానున్నాయి.
దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 60 నుంచి 63 ఏళ్ల మధ్య ఉండాలి. SBI షార్ట్‌లిస్టింగ్ కమిటీ నిర్ణయించిన అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. అనంతరం వారు 100 మార్కుల ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూలో మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 36,000 నుండి రూ. 41,000 వరకు వేతనం ఇవ్వనున్నారు.
* RIEM టీచర్స్ రిక్రూట్‌మెంట్- 2022
రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మైసూరు (RIEM) వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనుంది. వివిధ భాషలకు సంబంధించి మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.19,000 నుంచి రూ.27,500 వరకు వేతనం లభించనుంది.
* జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) రిక్రూట్‌మెంట్- 2022
జేఎస్‌ఎస్‌సీ.. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 991 క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు JSSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూన్ 19లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 10, 12వ తరగతి పాసై ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష ఉంటుంది. ఆ తరువాత టైపింగ్ టెస్ట్ లేదా కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహించనున్నారు. స్టెనోగ్రాఫర్ పోస్టుకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు వేతనం లభించనుంది. క్లర్క్ పోస్టుకు రూ.19,000 నుంచి రూ.63,200 వరకు జీతం ఉండనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Indian, IT jobs, Job notification, Sbi