• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • JNVST CLASS 6 REGISTRATION 2020 2021 LAST DATE OF REGISTRATION IS 15 SEPTEMBER APPLY ONLINE AT NAVODAYA GOV IN BS

Navodaya Admissions 2020: నవోదయ పరీక్ష దరఖాస్తుకు గడువు మరో ఐదు రోజులే..

Navodaya Admissions 2020: నవోదయ పరీక్ష దరఖాస్తుకు గడువు మరో ఐదు రోజులే..

ప్రతీకాత్మక చిత్రం

Navodaya Admissions 2020: 2007 మే 1 నుంచి 2011 ఏప్రిల్ 30 మధ్య జన్మించిన విద్యార్థులు సెప్టెంబరు 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు www.navodaya.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. 

  • Share this:
కేంద్రీయ జవహార్ నవోదయ విద్యాలయాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గానూ 2020-2021 విద్యాసంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలకు 'నవోదయ విద్యాల‌య స‌మితి' ద‌ర‌ఖాస్తులు కోరుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత విద్యా సంవత్సరం (2019-20)లో ప్రభుత్వ/ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాగా, దరఖాస్తుకు మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. 2007 మే 1 నుంచి 2011 ఏప్రిల్ 30 మధ్య జన్మించిన విద్యార్థులు సెప్టెంబరు 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు www.navodaya.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.  గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కనీసం 75 శాతం సీట్లు, బాలికలకు 1/3వ వంతు సీట్లు కేటాయించినట్లు నవోదయ విద్యాలయ సమితి తెలిపింది.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు:
దరఖాస్తుల ఆహ్వానం- 01 జూలై 2019
దరఖాస్తుకు చివరి తేది- 15 సెప్టెంబరు 2019
జేఎన్‌వీఎస్‌టీ అర్హత పరీక్ష- 11 జనవరి 2020 (ఫేజ్-1), 11 ఏప్రిల్ 2020 (ఫేజ్-2)

ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.. ప్రవేశాలకు దరఖాస్తు

పరీక్ష విధానం:

మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. వాటికి  100 మార్కులు కేటాయిస్తారు. కేటాయించే సమయం: 2 గంటలు

  •  మెంటల్ ఎబిలిటీ- 40 ప్రశ్నలు

  • ఆర్థమెటిక్ పరీక్ష- 20 ప్రశ్నలు

  • లాంగ్వేజ్ పరీక్ష - 20 ప్రశ్నలు

First published: