హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JNU UG Admissions: CUET స్కోర్‌తో JNU డిగ్రీ అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెక్ చేయండి..

JNU UG Admissions: CUET స్కోర్‌తో JNU డిగ్రీ అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెక్ చేయండి..

JNU UG Admissions: CUET స్కోర్‌తో JNU డిగ్రీ అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెక్ చేయండి..

JNU UG Admissions: CUET స్కోర్‌తో JNU డిగ్రీ అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెక్ చేయండి..

JNU UG Admissions: ఢిల్లీకి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) బుధవారం కీలక ప్రకటన చేసింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అడ్మిషన్స్ ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ ఏడాది నుంచి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌ (CUET)ను నిర్వహించిన విషయం తెలిసిందే. సీయూఈటీ అండర్‌ గ్రాడ్యుయేట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ స్కోర్ ఆధారంగా అభ్యర్థులు వివిధ యూనివర్సిటీ (Universities)ల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) బుధవారం కీలక ప్రకటన చేసింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అడ్మిషన్స్ ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం CUET యొక్క తొలి ఎడిషన్ ఫలితాలను ఈ నెల ప్రారంభంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. CUET ఎగ్జామ్ నిర్వహించడానికి ముందు JNU ప్రత్యేకంగా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JNUEE) ద్వారా అడ్మిషన్స్ చేపట్టేది. అయితే ఈసారి CUET ఫలితాల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని వర్సిటీ నిర్ణయం తీసుకుంది.

* ఆ కోర్సుల్లో ప్రవేశాలు

జేఎన్‌యూ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్స్ అందించేందుకు ఈ ఏడాది CUET స్కోర్‌ను ప్రామాణికంగా ఎంచుకుంది. 2022-23 విద్యా సంవత్సరానికి వర్సిటీలోని BA (ఆనర్స్) ఇన్ ఫారిన్ లాంగ్వేజెస్, BSc-MSc ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ ఆయుర్వేద బయాలజీ, సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్లు CUET (UG) 2022 ద్వారా జరుగుతున్నాయి. అభ్యర్థులు JNUEE అధికారిక వెబ్‌సైట్ jnu.ac.in ద్వారా యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు అప్లై చేసుకోవచ్చు.

* ఈసారి ఆలస్యం

సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈసారి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను JNU చాలా ఆలస్యంగా ప్రారంభించింది. ఢిల్లీకి చెందిన జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ గత నెలలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించగా, ఢిల్లీ యూనివర్సిటీ సెప్టెంబర్ 12న అడ్మిషన్ పోర్టల్‌ ఓపెన్ చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన CUET ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది.

* అప్లికేషన్ ప్రాసెస్

విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jnu.ac.in ఓపెన్ చేసి.. BA ప్రోగ్రామ్‌లకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ CUET-UG అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని పాస్‌వర్డ్‌గా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి, ఆన్‌లైన్ అప్లికేషన్‌ను నింపాలి. తర్వాత ఫోటోగ్రాఫ్, సంతకం స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయండి. చివరగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, OBC కేటగిరీ అభ్యర్థులు రూ.250 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వికలాంగుల కేటగిరీ అభ్యర్థులు రూ.100 చొప్పున, విదేశీ పౌరులు రూ.2,392 చెల్లించాలి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, CUET 2022, EDUCATION, JNU, JOBS

ఉత్తమ కథలు