Hack JNU Competition: జేఎన్‌యూలో హ్యాకింగ్ పోటీ... రూ.10,000 బ‌హుమ‌తి

(ప్రతీకాత్మక చిత్రం)

జ‌వ‌ర‌హ‌ర్ లాల్ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ (జేఎన్‌యూ) హ్య‌కింగ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ పోటీలో ఎవ‌రైనా పాల్గొన వ‌చ్చ‌ని తెలిపింది. ఈవెంట్ సెప్టెంబర్ 25న జరుగుతుంది. దరఖాస్తుకు చేసుకోవడానికి ఆగస్టు 25, 2021 ఆఖరు తేదీ.

  • Share this:
    జ‌వ‌ర‌హ‌ర్ లాల్ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ (జేఎన్‌యూ) హ్య‌కింగ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ పోటీలో ఎవ‌రైనా పాల్గొన వ‌చ్చ‌ని తెలిపింది. ఈ హ్య‌కింగ్ ఈవెంట్‌లో గెలిచిన మొద‌టి బ‌హుమ‌తి కింద రూ.10,000 రెండో బ‌హుమ‌తి రూ.7,000 మూడో బ‌హుమ‌తి రూ.4,000 అందించ‌నుంది.
    విద్యార్థుల లోని సాంకేతికి సామ‌ర్థ్యాన్ని గుర్తించేందుకు జేఎన్‌యూ కొత్త ఈవెంట్‌కు శ్రీ‌కారం చుట్టింది. అదే హ్య‌క్ జేఎన్‌యూ. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ 4, 2021న ఈవెంట్‌ను నిర్వ‌హిచ‌నున్నారు. ఆస‌క్తిక గ‌ల వారు ఆగ‌స్టు 25లోపు రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని సూచించారు. ద‌ర‌ఖాస్తు చేసుకొన్న‌వారి లిస్టును ప‌రిశీలించి అందులో షార్టులిస్టు చేసిన అభ్య‌ర్థుల వివ‌రాల‌ను సెప్టెంబ‌ర్ 1, 2021న ప్ర‌క‌టిస్తారు. అందులో షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థులు ఈవెంట్‌లో పాల్గొనవ‌చ్చు. ఈ పోటీలో ఆరు థీమ్‌లు ఉన్నాయి. ఈ ఈవెంట్ ప‌రిశీలించేందుకు న్యాయ నిర్ణేత‌లుగా న‌లుగురు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.
    ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..
    - అభ్య‌ర్థులు జేఎన్‌యూ అధికారిక వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
    - అభ్య‌ర్థి ఈమెయిల్ ఐడీతో యూజ‌ర్ ఐడీ క్రియేట్ చేసుకొని పాస్‌వ‌ర్డు ఏర్పాటు చేసుకోవాలి.
    - అనంత‌రం యూజ‌ర్ ఐడీ పేరుతో లాగిన్ అవ్వాలి.
    ఈ ఈవెంట్‌లో పాల్గొన‌డానికి ఎలాంటి రిజిస్ట్రేష‌న్ ఫీజు అక్క‌ర్లేదు. హ్య‌క్‌జేఎన్‌యూ ఈవెంట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొన్న వారిలో 100 జ‌ట్ల‌ను మాత్ర‌మే షార్ట్ లిస్టు చేస్తారు. పాల్గొనే వారు ఎవ‌రైనా స‌రే జ‌ట్టుగా న‌మోదు చేసుకోవాలి. ఒక జ‌ట్టులో ఇద్ద‌రు లేదా న‌లుగురి మ‌ధ్య ఉండొచ్చు.
    ప్ర‌స్తుతం కోవిడ్ నేప‌థ్యంలో ఈవెంట్‌ను ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించ‌నున్నారు. ఆన్‌లైన్‌లో జేఎన్‌యూ ఆధ్వ‌ర్యంలోనే ఈవెంట్ జ‌రుగుతుంది. ఇందులో పాల్గొన‌డానికి ఎటువంటి నిబంధ‌న‌లు లేవు. ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చు. హ్య‌కింగ్‌పై ఆస‌క్తిగ‌ల వారెవ‌రైనా స‌రే ఇందులో పాల్గొన వ‌చ్చు. మొద‌టి బ‌హుమ‌తి రూ.10,000, రెండో బ‌హుమ‌తి రూ.7,000, మూడో బ‌హుమ‌తి 4,000 గా నిర్దేశించారు. దీనితోపాటు జేఎన్‌యూ టాప్ టెన్ జ‌ట్ల‌కు రూ.10ల‌క్ష‌ల విలువూన ఏపీఐ బ‌హుమ‌తి కూడా ఉంది. ఈవెంట్ నిర్వ‌హించ‌న రోజునే విజేత‌ల‌ను ప్ర‌క‌టిస్తారు.

    ఈవెంట్ నిర్వ‌హించే తేదీ సెప్టెంబ‌ర్ 25, 2021
    ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రు తేదీ ఆగ‌స్టు 25, 2021
    ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు క్లిక్ చేయండి
    Published by:Sharath Chandra
    First published: