హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Viral Video: క్యాంపస్ లోనే శోభనం.. యూనివర్శిటీని హనీమూన్ సెంటర్ గా మార్చిన ప్రొఫెసర్..

Viral Video: క్యాంపస్ లోనే శోభనం.. యూనివర్శిటీని హనీమూన్ సెంటర్ గా మార్చిన ప్రొఫెసర్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విశ్వవిద్యాలయం అంటే ఎంతో పవిత్రంగా చూస్తారు. చదువులమ్మ ఒడిలో ఉన్నత విద్యకోసం ఎంతో మంది నిరంతరం శ్రమిస్తుంటారు. అలాంటి క్యాంపస్ ను ఓ ప్రొఫెసర్ హనీమూన్ సెంటర్ గా మార్చడం.. తీవ్ర విమర్శలకు తావిస్తోంది..

P. ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18,              అది ఓ చదువుల తల్లి సరస్వతీ దేవి నిలయమైన విశ్వవిద్యాలయం.. ఏపీలోనూ చాలా ప్రత్యేమైనదిగా గుర్తింపు పొందిన క్యాంపస్.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జె‌ఎన్.టి.యు. ఉన్నత విద్య కోసం విద్యార్థులంతా ఆ యూనివర్శిటీని వేదికగా చేసుకుంటున్నారు. అలాంటి విశ్వ విద్యాలయ గెస్ట్ హౌస్ ను ఓ ప్రొఫెసర్ హనీమూన్ సెంటర్ గా మార్చేశారు. చదువులమ్మ ఒడిని అపవిత్రంగా మార్చేశారు. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌస్ లో ఆగస్ట్ 18 రాత్రి నూతన దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఆగస్టు 18న ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ..స్వర్ణ కుమారి గెస్ట్ హౌస్ లో మూడు గదులను బుక్ చేసుకున్నారు. అందులో 201 గదిలో ఆగస్టు 18వ తేదీ రాత్రి నూతన దంపతులకు అట్టహాసంగా శోభనానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఇలాంటి వేడుకలకు యూనివర్శిటీ గెస్ట్ హౌస్ లను వాడకూడదనే నిబంధన ఉంది. శోభనం అనే కాదు.. సాధారణంగా ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరు. అయినా వాటిని అతిక్రమిస్తూ.. శోభనానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు ఆమె కుటుంబ సభ్యులు బంధుమిత్ర సపరివార సమేతంగా హజరయ్యారు. నిబంధనలకు విరుధ్దంగా యూనివర్సిటీ యాజమాన్యం గెస్ట్‌హౌస్‌లో శోభనానికి అనుతివ్వటంతో ఇప్పుడు సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.

క్యాంపస్ ఏమైనా అత్తారిల్లా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తం మూడు గదులు బుక్ చేయగా.. ఒక గదిలో శోభనం ఏర్పాటు చేశారు.. మిగిలిన రెండు గదుల్లో పెళ్లి వేడుకలు జరిపినట్లు సమాచారం. వర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్ పేరుతో గదులు బుక్ చేశారని గుడ్డిగా.. అక్కడ ఏం జరుగుతోందో కూడా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాధారణంగా ఇతర ప్రాంతాల నుంచి యూనివర్సిటీ వ్వవహారాల నిమిత్తం ఇక్కడికి వచ్చే అధికారులు, సిబ్బందికి ఈ గదులను అద్దెకు ఇస్తుంటారు. అంతేగానీ ఇక్కడ ప్రైవేట్ కార్యకలాపాలకు తావు లేదు. విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ ఇలా ప్రైవేట్ కార్యక్రమం కోసం.. అది కూడా శోభనం కోసం ఉపయోగించుకోవడం దారుణమని విద్యార్థి నాయకులు మండిపడుతున్నారు. ప్రొఫెసర్‌తో పాటు అందుకు అనుమతినిచ్చిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వర్సిటీ విద్యార్థి,ఉద్యోగ సంఘాలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలో ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యాన్ని వివరణ కోరగా... దీనిపై ఒక కమిటీ వేసి విచారణకు ఆదేశిస్తామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kakinada

ఉత్తమ కథలు