JNTUH Exams | జేఎన్టీయూహెచ్ పరిధిలో యూజీ, పీజీ పరీక్షలు వాయిదా...

జేఎన్టీయూహెచ్ పరిధిలో పరీక్షలు ప్రస్తుతం వాయిదా పడడంతో ఇక ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పరీక్షల మీద కూడా సందిగ్ధత ఏర్పడింది.

news18-telugu
Updated: June 12, 2020, 7:34 PM IST
JNTUH Exams | జేఎన్టీయూహెచ్ పరిధిలో యూజీ, పీజీ పరీక్షలు వాయిదా...
2021 జనవరి 11 నుంచి 23 వరకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనుంది.
  • Share this:
జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని యూజీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలోరిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, వాటిని వాయిదా వేస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ పదో తరగతి పరీక్షలపై సమీక్ష నిర్వహించినప్పుడు టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. ఏడాది కాలంలో నిర్వహించిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులను పాస్ చేయాలని చెప్పారు. ఇక యూజీ, పీజీ పరీక్షల మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అయితే, ప్రస్తుతం జేఎన్టీయూహెచ్ పరిధిలో పరీక్షలను ప్రభుత్వం చెప్పిన తర్వాతే నిర్వహించాలని నిర్ణయించింది.

జేఎన్టీయూహెచ్ పరిధిలో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల ఎక్కువ శాతం పరీక్షలు రాస్తుంటారు. కరోనా వల్ల తాము ఇతర ప్రాంతాల్లో ఉన్నామని, పరీక్షలు రాయడం తమకు ఇబ్బందిగా మారుతుందంటూ చాలా మంది విద్యార్థులు తమ సమస్యలను యూనివర్సిటీ దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ షెడ్యూల్ ప్రకటించడం మీద ప్రభుత్వ వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జేఎన్టీయూహెచ్ పరిధిలో పరీక్షలు ప్రస్తుతం వాయిదా పడడంతో ఇక ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పరీక్షల మీద కూడా సందిగ్ధత ఏర్పడింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 12, 2020, 7:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading