Home /News /jobs /

JNTUH PLANS TO CONDUCT BTECH AND B PHARMACY EXAMS IN ONLINE MODE BY USING PROCTORED EXAM SOFTWARE NS

Telangana Exams: ఇంటి నుంచే ఆ ఫైనల్ ఎగ్జామ్స్ రాసే ఛాన్స్.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ను సిద్ధం చేసిన అధికారులు.. ఎలా పని చేస్తుందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ప్రత్యక్షంగా పరీక్షలను నిర్వహించే అవకాశం లేదు. దీంతో తెలంగాణలోని ప్రముఖ యూనివర్సిటీ జేఎన్టీయూహెచ్ ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఇంకా చదవండి ...
    కరోనా నేపథ్యంలో గతేడాదితో పాటు ఈ సారి కూడా పరీక్షల నిర్వహణ గందరగోళంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. తెలంగాణలోనూ టెన్త్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలను లేకుండానే పైతగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సెకండియర్ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం జూన్ మొదటి వారంలో ఆ ఎగ్జామ్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీలోనూ టెన్త్ ఎగ్జామ్స్ ను సర్కార్ వాయిదా వేసింది. నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణ కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష్యంగా పరిక్షలను నిర్వహించే పరిస్థితి లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. దీంతో టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చునే హైదరాబాద్ లోని ప్రముఖ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(JNTUH)  పరీక్షల నిర్వహణ విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక సాఫ్ట్ వేర్ సహాయంతో ఆన్లైన్లో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది.
    AP Tenth, Inter Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై మంత్రి సురేష్ కీలక ప్రకటన.. పూర్తి వివరాలివే

    ప్రొక్టర్డ్ అనే సాఫ్ట్ వేర్ ను వినియోగించుకుని పకడ్భందీగా పరీక్షలను నిర్వహించాలని జేఎన్టీయూ నిర్ణయానికి వచ్చింది. జూన్ 14 నుంచి యూనివర్సిటీ పరిధిలోని బీటెక్, బీఫార్మసీ విద్యార్థులకు ఎగ్జామ్స్ ను నిర్వహించాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. అయితే బీటెక్ విద్యార్థులకు కేవలం మూడు ఎగ్జామ్స్, బీఫార్మసీ విద్యార్థులకు ఐదు సబ్జెక్టులకు మాత్రమే పరిక్షలను నిర్వహించాల్సి ఉంది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఆయా పరీక్షలను పూర్తి చేయాలని యూనివర్సిటీ అధికారులు యోచిస్తున్నారు.

    పరీక్ష నిర్వహణ ఇలా..
    విద్యార్థులు మొదటగా తమ కంప్యూటర్ లో ప్రొక్టర్డ్ ఎగ్జామ్ సాఫ్ట్ వేర్ ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతం ఐడీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అనుమతి ఉంటుంది. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడాన్ని అరికట్టేందుకు ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని వినియోగించనున్నారు. అయితే పరీక్ష రాసే సమయంలో విద్యార్థుల కంప్యూటర్లో ఇతర వెబ్ సైట్లు ఏమీ ఓపెన్ కావు. గూగుల్, ఇతర వెబ్ సైట్లలో చూసి కాపీ కొట్టే ఛాన్స్ లేకుండా అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

    విద్యార్థులు అటూ ఇటూ చూసినా సాఫ్ట్ వేర్ గుర్తిస్తుంది. ఇలా చేస్తే అధికారులు పరిశీలించి విద్యార్థులను డిబార్ కూడా చేస్తారు. 15 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ ను నియమిస్తారు. వారు కూడా విద్యార్థులు చదివే కాలేజీ కాకుండా ఇతర కాలేజీలకు చెందిన వారిని నియమిస్తారు. ఇన్విజిలేటర్లు విద్యార్థులను వెబ్ క్యామ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తే డిబార్ చేస్తారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Exams postponed, JNTUH, Online classes, Online Education, Telangana exams, University exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు