హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JNTUH: ప్ర‌తీ కళాశాల‌లో ఇక‌పై స్కిల్ కోర్సులు.. సెల‌బ‌స్ విధానంలో మార్పులు.. జెన్‌టీయూ కీల‌క నిర్ణ‌యం

JNTUH: ప్ర‌తీ కళాశాల‌లో ఇక‌పై స్కిల్ కోర్సులు.. సెల‌బ‌స్ విధానంలో మార్పులు.. జెన్‌టీయూ కీల‌క నిర్ణ‌యం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JNTU Hyderabad | జేఎన్టీయూ హైదరాబాద్‌  పరిధిలో అన్ని క్యాంపస్‌, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అఫిలియేటెడ్‌, అటానమస్‌ కాలేజీల్లో రెగ్యులర్‌ అకడమిక్‌ కోర్సులతో పాటు నైపుణ్య కోర్సులను కూడా తప్పనిసరి బోధించాలని వర్సిటీ కీలక నిర్ణయం తీసుకొంది.

ఇంకా చదవండి ...

సాంకేతిక విద్య‌ (Technical Education) లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త విధానాల‌ను ప్ర‌వేశ పెడుతూ మెరుగైన విద్య‌ను అందించ‌డానికి జేఎన్టీయూ ప్ర‌య‌త్నీస్తోంది. తాజాగా జేఎన్టీయూ హైదరాబాద్‌  పరిధిలో అన్ని క్యాంపస్‌, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అఫిలియేటెడ్‌, అటానమస్‌ కాలేజీల్లో రెగ్యులర్‌ అకడమిక్‌ కోర్సులతో పాటు నైపుణ్య కోర్సులను కూడా తప్పనిసరి బోధించాలని వర్సిటీ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ విషయాన్ని వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ కట్టా నరసింహారెడ్డి పేర్కొన్నారు.  ఆయ‌న‌ వీసీగా బాధ్యతలు చేపట్టి సోమవారానికి ఏడాది పూర్తి చేసుకొన్నారు. ఈ సందర్భంగా సంవత్సర కాలంలో జేెఎన్టీయూ పరిధిలో చేపట్టిన సంస్కరణలను  వెల్లడించారు.  నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అనేక నిర్ణయాలు తీసుకొన్నామని వెల్లడించారు.

Jobs in Air India: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

అంతే కాకుండా జేఎన్టీయూ పరిధిలో ఒకే విద్యా సంవత్సరంలో డబుల్‌ డిగ్రీలు చేసేందుకు అనుమతించాలని బోర్డు ఆఫ్‌ స్టడీస్‌(బీవోఎస్‌) సమావేశం నిర్ణయించింది. డబుల్‌ డిగ్రీ చేస్తున్నవారికి క్రెడిట్స్‌ను ట్రాన్సఫర్‌ చేసుకొనే సౌకర్యం కల్పించనున్న‌ట్లు స‌మాచారం. కొత్త విధానంలో ప్రతి సెమిస్టర్‌కు 20 క్రెడిట్స్‌ కేటాయిస్తున్న‌ట్టు స‌మాచారం. మార్కెటింగ్‌, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్‌, ఫార్మసీ  (Pharmacy) కోర్సుల సిలబస్‌లో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. సిలబస్‌లో మార్పులు-చేర్పుల కోసం జేఎన్టీయూ (JNTU) వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులు బీవోఎస్‌ కమిటీ సమావేశాలు నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ప‌లు నిర్ణ‌యాలు తీసుకొన్నారు.

లాంగ్ ప్ర‌శ్న‌ల త‌గ్గింపు.. మధ్యలో మానేస్తే డిప్లమా..

జేఎన్టీయూలో ఇక‌పై జ‌రిగే ప్రతి సెమిస్టర్‌లో లాంగ్‌ ప్రశ్నల సంఖ్యల సంఖ్య త‌గ్గింఏ అవ‌కాశం ఉంది. దానితోపాటు షార్ట్‌ ప్రశ్నల సంఖ్య 20 వరకు పెంచుతారు. ల్యాబ్‌లలో చేసే ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో వెయిటేజీ కల్పిస్తారు. రిసెర్చ్‌ ప్రాజెక్టులను ఇంజినీరింగ్‌లో 2వ సంవత్సరం, 4వ సంవత్సరంలో తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 4వ సంవత్సరంలో మెయిన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. 40 శాతం మార్కులు ఇంటర్నల్‌ ప్రాజెక్టు (Internal Projects) లకు.. 60 శాతం మార్కులు సెమిస్టర్‌ పరీక్షలకు కేటాయించారు.

JioPhone Next: వినియోగ‌దారుల‌కు రిల‌య‌న్స్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.4,499తో సరికొత్తజియో ఫోన్ నెక్ట్స్‌

నాలుగేళ్లో బీటెక్‌ను పూర్తి చేయకుండా రెండేండ్లకే మధ్యలో మానేస్తే డిప్లొమా సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఇది విద్యార్థుల‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని యూనివ‌ర్సిటీ భావిస్తోంది. ఏదైనా కార‌ణాల వ‌ల్ల బీటెక్‌ రెండు లేదా మూడేండ్లు చదివిన తరువాత మానేసినా, ఆ తర్వాత మళ్లీ అడ్మిషన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. రెగ్యులర్‌ పాఠాలతో పాటు నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.

First published:

Tags: Career and Courses, EDUCATION, Engineering course, JNTUH

ఉత్తమ కథలు