హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JNTUH: విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ప‌రీక్ష‌ల‌కు సంబంధించి జేఎన్‌టీయూ కీల‌క నిర్ణ‌యం

JNTUH: విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ప‌రీక్ష‌ల‌కు సంబంధించి జేఎన్‌టీయూ కీల‌క నిర్ణ‌యం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JNTUH: విద్యార్థుల‌ పరీక్షలకు సంబంధించి జేఎన్‌టీయూ (JNTU) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కనీస హాజరు శాతం నుంచి విద్యార్థులకు జేఎన్టీయూ మినహాయింపు ఇచ్చింది.

  విద్యార్థుల‌ పరీక్షలకు సంబంధించి జేఎన్‌టీయూ (JNTU) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కనీస హాజరు శాతం నుంచి విద్యార్థులకు జేఎన్టీయూ మినహాయింపు ఇచ్చింది.  హాజరుతో పనిలేకుండా జూలైలో నిర్వహించే బీటెక్‌, ఎంటెక్‌, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ సెమిస్టర్‌ పరీక్షలకు విద్యార్థులను అనుమతించనున్నట్టు స‌మాచారం. గతంలో ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి. ఒకవేళ 65 శాతం హాజరు ఉంటే మెడికల్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా 10 శాతం కలిపి పరీక్షలకు అనుమతించేవారు. కరోనా నేపథ్యంలో నిరుడు కనీస హాజరు శాతం నుంచి మినహాయింపు ఇచ్చారు.

  TS TET 2022: నేడు తెలంగాణ టెట్‌-2022.. అభ్య‌ర్థులు గుర్తుంచుకోవాల్సి కీల‌కైన అంశాలు ఇవే!


  ఈ విద్యాసంవత్సరం కూడా అమలు చేసుకున్నారు. సెమిస్టర్‌ పరీక్షల్లో చాయిస్‌ ప్రశ్నలను సైతం కొనసాగించనున్నట్టు జేఎన్టీయూ ప్రకటించింది. తాజా విధానంలో 8 ప్రశ్నలకుగాను విద్యార్థులు ఏదేని ఐదు ప్రశ్నలు రాస్తే సరిపోతుందని తెలిసింది. కొవిడ్‌ మార్గదర్శకాలు అనుసరించే పరీక్షలు జరుగుతాయని జేఎన్‌టీయూ వ‌ర్గాలు చెబుతున్నాయి.

  సాంకేతిక విద్య‌ (Technical Education) లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త విధానాల‌ను ప్ర‌వేశ పెడుతూ మెరుగైన విద్య‌ను అందించ‌డానికి జేఎన్టీయూ ప్ర‌య‌త్నీస్తోంది. తాజాగా జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఒకే విద్యా సంవత్సరంలో డబుల్‌ డిగ్రీలు చేసేందుకు అనుమతించాలని బోర్డు ఆఫ్‌ స్టడీస్‌(బీవోఎస్‌) సమావేశం నిర్ణయించింది.

  జేఎన్టీయూలో ఇక‌పై జ‌రిగే ప్రతి సెమిస్టర్‌లో లాంగ్‌ ప్రశ్నల సంఖ్యల సంఖ్య త‌గ్గింఏ అవ‌కాశం ఉంది. దానితోపాటు షార్ట్‌ ప్రశ్నల సంఖ్య 20 వరకు పెంచుతారు. ల్యాబ్‌లలో చేసే ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో వెయిటేజీ కల్పిస్తారు. రిసెర్చ్‌ ప్రాజెక్టులను ఇంజినీరింగ్‌లో 2వ సంవత్సరం, 4వ సంవత్సరంలో తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 4వ సంవత్సరంలో మెయిన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. 40 శాతం మార్కులు ఇంటర్నల్‌ ప్రాజెక్టు (Internal Projects) లకు.. 60 శాతం మార్కులు సెమిస్టర్‌ పరీక్షలకు కేటాయించారు

  ECIL Jobs: ఈసీఐఎల్ హైద‌రాబాద్‌లో క్ల‌ర్క్ జాబ్స్‌.. వేత‌నం నెల‌కు రూ.20,480.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

  నాలుగేళ్లో బీటెక్‌ను పూర్తి చేయకుండా రెండేండ్లకే మధ్యలో మానేస్తే డిప్లొమా సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఇది విద్యార్థుల‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని యూనివ‌ర్సిటీ భావిస్తోంది. ఏదైనా కార‌ణాల వ‌ల్ల బీటెక్‌ రెండు లేదా మూడేండ్లు చదివిన తరువాత మానేసినా, ఆ తర్వాత మళ్లీ అడ్మిషన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. రెగ్యులర్‌ పాఠాలతో పాటు నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Career and Courses, EDUCATION, Engineering, JNTUH

  ఉత్తమ కథలు