హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JNTU Education Policy : విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. స్ట‌డీ బ్రేక్ పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టిన జేఎన్‌టీయూ

JNTU Education Policy : విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. స్ట‌డీ బ్రేక్ పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టిన జేఎన్‌టీయూ

జేఎన్‌టీయూ

జేఎన్‌టీయూ

జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (Jawaharlal Nehru Technology University) బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులు ఎవ‌రైనా చ‌దువు మ‌ధ్య‌లో మానే మ‌ళ్లి చేరేందుకు ఇబ్బంది ప‌డుతున్నారో వారి కోసం కొత్త విధానం (New Policy) తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...

    జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (Jawaharlal Nehru Technology University) బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులు ఎవ‌రైనా చ‌దువు మ‌ధ్య‌లో మానే మ‌ళ్లి చేరేందుకు ఇబ్బంది ప‌డుతున్నారో వారి కోసం కొత్త విధానం (New Policy) తీసుకొచ్చింది. అంతే కాకుండా స్టార్టప్స్‌ లో రాణించే విద్యార్థులను ప్రోత్సహించడానికి కూడా కొత్త నిబంధ‌న‌లు తెచ్చింది. తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవిద్యార్థుల‌కు కూడా కొత్త విధానంలో అవకాశం కల్పించింది. ఈ మేరకు జేఎన్ టీయూ (JNTU) మార్గదర్శకాలు (Guidelines) వెల్లడించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్లు జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. గ‌తంలో బీటెక్‌లో చేరితే నాలుగేళ్లపాటు వరుసగా చదువాల్సి వ‌చ్చేది.

    ఎవ‌రు అర్హులు..

    - ఈ విధానంలో స్టార్టప్స్‌ వెంచర్లు, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు మాత్రమే బ్రేక్‌ స్టడీకి అర్హులని ప్రకటించింది.

    - వారు కూడా తొలి నాలుగు సెమిస్ట‌ర్లు పూర్తి చేసి ఉండాలి.

    - ఈ విధానంలో బ్యాక్‌లాగ్స్ ఉన్న‌వారికి హాజ‌రుశౄతం స‌రిగా లేనివారికి అవ‌కాశం లేద‌ని గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు.

    Education : మేము స్కూళ్ల‌కు వెళ్తాం.. కౌంటింగ్‌వెల్ సర్వే ఆసక్తిక‌ర విశేషాలు


    - ఎవ‌రైతే బ్రేక్ స్ట‌డీకి అప్లే చేసుకోవాల‌నుకొంటున్నారో వారు ముంద‌గా జేఎన్‌టీయూ వీసీకి రిపోర్ట్‌ చేసి, అనుమతి పొందాల్సి ఉంటుంది.

    - ఇక విద్యార్థులు ఏ కార‌ణంగా స్ప‌ష్టంగా వెల్ల‌డించాలి.

    - ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించి కాలేజీ ప్రిన్స్‌పాల్ నుంచి ముందుగా అనుమ‌తి పొందాలి.

    - వీరిఉ సంవత్సరం పూర్తికాగానే మళ్లీ కోర్సులో తప్పనిసరిగా చేరాల్సి ఉంటుంది.

    ఈ కొత్త విధానంలో ఇప్పుడు ఒక విద్యార్థి గరిష్ఠంగా రెండు సెమిస్టర్లపాటు తాత్కాలిక విరామం తీసుకొనే అవ‌కాశం క‌ల్పించింది. బీటెక్‌ విద్యార్థులు కొందరు ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు స్టార్టప్స్‌లో రాణిస్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు స్టార్ట‌ప్ రూపంలో సాంకేతిక పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్స‌హించేందుకు కూడా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వారికి చ‌దువు అడ్డుగా వ‌స్తుంది. చ‌దువా స్టార్ట‌ప్ ఆ అనే ఇబ్బందిలో ప‌డుతున్నారు. అలాంటి వారికి చ‌దువుపై ప‌డితే కొత్త ఆలోచ‌న‌లు ఆగిపోతాయని జేఎన్‌టీయూ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన జేఎన్ టీయూ బ్రేక్‌ స్టడీ విధానాన్ని తీసుకొచ్చింది.

    మ‌ళ్లీ కాలేజీలో చేరేలా యూజీసీ నిబంధ‌న‌లు..

    కేంద్రం ఉన్న‌త విద్యా విధానంలో మ‌ల్లిపుల్‌ ఎంట్రీ-ఎగ్జిట్ విధానాన్ని ప్ర‌వేశ పెట్టింది. ఈ విధానంతో విద్యార్థులు ఎప్పుడైనా చ‌దువు మానేసినా.. మ‌ళ్లీ తిరిగి అక్క‌డి నుంచే చ‌దువుకొనే అవ‌కాశం ఉంది. ఈ విధానానికి సంబంధించి యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ఈ విధానాన్ని ముందుగా కేంద్రం ఆధీనంలో ఉన్న కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యంలో అమ‌లు చేయ‌నున్నారు.

    యూజీసీ నిబంధ‌న‌లు ఇవే..

    - డిగ్రీలో చేరిన విద్యార్థి చ‌దువు వ‌దిలేసీ వెళ్లాలంటే ఏడాది త‌ర్వాత మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది. అంటే సెమి్ట‌ర్ త‌ర్వాత వెళ్లడానికి వీళ్లేద‌ని స్ప‌ష్టం చేసింది.

    IT Recruitment 2021 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఐటీలో భారీగా ఉద్యోగాలు


    - ఒక క‌ళాశాల నుంచి మ‌రో దానికి 3,5,7 సెమిస్ట‌ర్‌ల‌ల‌నే మారాలి.

    - చ‌దువు మానుకొని వెళ్లాలంటే 2,4,6,8 సెమిస్ట‌ర్లు పూర్త‌య్యాకే మానేయాలి.

    - ఈ లోపు మానేయ‌డం కుద‌ర‌దు. మూడేళ్ల‌కు జ‌న‌ర‌ల్ డిగ్రీ చేరిన వారు ఒక‌టి, రెండో సంవ‌త్స‌రం పూర్త‌యిన త‌ర్వాత చ‌దువు మానేయ‌వ‌చ్చు.

    - అదే రెండేళ్ల పీజీ చేరిన వారు ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం పూర్త‌యిన త‌ర్వాత బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌చ్చు.

    - డిగ్రీని మూడేళ్ల సాధార‌ణ కోర్సు మాదిరిగా కాకుండా నాలుగేళ్ల హాన‌ర్స్ లేదా రీసెర్చ్ కోర్సుగా చేయొచ్చు.

    - నాలుగో సంవ‌త్స‌రం ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. మూడేళ్ల డిగ్రీ చ‌దివిన వారు రెండేళ్ల పీజీ చేయాలి. అదే నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన‌వారు ఒక‌సంవ‌త్స‌రం పీజీ చ‌దువుతారు.

    - ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ చేసిన వారికి మూడేళ్ల త‌ర్వాత ఎగ్జిట్ ఆప్ష‌న్ ఇస్తారు.

    - మొత్తం కోర్సులో 40శాతం క్రెడిట్ల‌ను స్వ‌యంగా పోర్ట‌ల్ ద్వారా ఆన్‌లైన్‌లో పొంద‌వ‌చ్చు. స‌ర్టిఫికెట్‌కు 36-40 క్రెడిట్‌లు, డిప్లొమాకు 72-80 క్రెడిట్లు, డిగ్రీ హాన‌ర్స్ 108-120 క్రెడిట్లు, రీసెర్చ్ డిగ్రీకి 144-160 క్రెడిట్లు ఇస్తారు. సాధారణ విద్య, ఒకేష‌న‌ల్ విద్య క‌లిపి ఇస్తారు. విద్యార్థి ఏదో ఒక వృత్తి విద్య‌ను త‌ప్ప‌ని స‌రిగా చేయాలి.

    Published by:Sharath Chandra
    First published:

    Tags: EDUCATION, JNTUH, Students, Telangana students

    ఉత్తమ కథలు