హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JNTU Hyderabad: ఇండస్ట్రీ నిపుణులకు ప్రొఫెసర్లుగా అవకాశం..JNTUH‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కాన్సెప్ట్‌’ డీటెయిల్స్ ఇవే

JNTU Hyderabad: ఇండస్ట్రీ నిపుణులకు ప్రొఫెసర్లుగా అవకాశం..JNTUH‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కాన్సెప్ట్‌’ డీటెయిల్స్ ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ అకడమిక్ ఇయర్(2022-23) నుంచి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లలో కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అడ్వాన్స్‌డ్ సిలబస్ ప్రవేశపెట్టడంపై యూజీసీ ప్రత్యేక దృష్టిసారించింది. అంతేకాకుండా వీలైనన్ని ఎక్కువ ప్రాంతీయ భాషల్లో కోర్సులను అందించే యోచనలో ఉంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

JNTU Hyderabad: విద్యా విధానంలో అవసరమైన మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఈ అకడమిక్ ఇయర్(2022-23) నుంచి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లలో కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అడ్వాన్స్‌డ్ సిలబస్ ప్రవేశపెట్టడంపై యూజీసీ ప్రత్యేక దృష్టిసారించింది. అంతేకాకుండా వీలైనన్ని ఎక్కువ ప్రాంతీయ భాషల్లో కోర్సులను అందించే యోచనలో ఉంది. అయితే ఈ కొత్త తరహా సబ్జెక్టులను బోధించడానికి తగిన విద్యార్హతలు, ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న నిపుణులను గుర్తించడం అంత తేలికైన పనికాదు. ఇందుకు హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఓ పరిష్కార మార్గం కనుగొంది. ప్రొఫెసర్ ప్రాక్టీస్ కాన్సెప్ట్‌కు జేఎన్‌టీయూ-హెచ్ ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టుంది. ఈ కాన్సెప్ట్ పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

 పీహెచ్‌డీ నిబంధన తప్పనిసరి కాదు

ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేసే ప్రొఫెసర్స్‌‌కు ఉద్దేశించిన ముసాయిదా మార్గదర్శకాలను యూజీసీ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ ఐడియా తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి JNTU దీన్ని ప్రవేశపెట్టింది. ఈ కాన్సెప్ట్ ప్రకారం.. పీహెచ్‌డీ తప్పనిసరి నిబంధనతో సంబంధం లేకుండా రిలవెంట్ రంగాలకు చెందిన ఎక్స్‌పర్ట్స్‌ను ఫ్యాకల్టీ మెంబర్స్‌గా కాలేజీలు నియమించుకోవచ్చు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను అందించే జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీలకు ఇది వర్తిస్తుంది.

అర్హత ప్రమాణాలు

UGC మార్గదర్శకాలకు అనుగుణంగా.. JNTUలో ప్రొఫెసర్స్‌గా ప్రాక్టీస్ చేయడానికి కొన్ని అర్హత ప్రమాణాలను నిర్ణయించారు. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ తమ వృత్తిలో కనీసం 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నవారు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. మంజూరైన పోస్టుల్లో కేవలం 10 శాతం పోస్టులకు మాత్రమే వీరిని ప్రాక్టీస్ ప్రొఫెసర్లుగా నియమించాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. వారు గరిష్టంగా మూడు సంవత్సరాల పాటు మాత్రమే సర్వీస్ చేయనున్నారు.

CBSE Board Exam 2023: మరో రెండు నెలల్లో సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌.. బెస్ట్ స్కోరింగ్ సాధించేందుకు ప్రిపరేషన్ టిప్స్ ఇవే..

కొత్త కోర్సులకు ఫ్యాకల్టీ లేమి

జేఎన్‌టీయూ- హైదరాబాద్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం మంజూర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌ వంటి కోర్సులకు ఫ్యాకల్టీ దొరకడం కష్టంగా మారిందన్నారు. దీంతో ఇండస్ట్రీ ఎక్స్‌ఫర్ట్స్‌ను టీచర్స్‌గా నియమించుకోవడానికి వీలుగా ప్రొఫెసర్‌ ఆఫ్ ప్రాక్టీస్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. కాలేజీల్లో బోధించగల నిపుణులను గుర్తించడానికి యూనివర్సిటీ పరిశ్రమలతో చర్చలు జరుపుతోందని హుస్సేన్ తెలిపారు.

అన్ని యూనివర్సిటీలు అమలు చేయాలి

జేఎన్‌టీయూ తీసుకొచ్చిన ఈ కాన్సెఫ్ట్‌ను యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్(యూజీసీ) అభినందించింది. దీనిపై యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సుసంపన్నమైన, మార్గదర్శకత్వాన్ని అందించడానికి మరిన్ని యూనివర్సిటీలు ఈ కాన్సెప్ట్‌ను అమలు చేయాలని కోరారు.

First published:

Tags: Career and Courses, JNTUH

ఉత్తమ కథలు