TS EAMCET 2019 : ఎంసెట్ హాల్‌టికెట్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

TS EAMCET 2019 | తెలంగాణలో నిర్వహించే ఎంసెట్ హాల్‌టికెట్స్‌ వచ్చేశాయి. విద్యార్థులు https://eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: April 24, 2019, 12:07 PM IST
TS EAMCET 2019 : ఎంసెట్ హాల్‌టికెట్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 24, 2019, 12:07 PM IST
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే టీఎస్ ఎంసెట్ 2019 పరీక్ష హాల్‌టికెట్స్ విడుదలయ్యాయి. తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in‌ ద్వారా అభ్యర్థులు హాల్‌టికెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా తమ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్ పరీక్ష హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు ఎంటర్ చేయాలి. అనంతరం డౌన్‌లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసిన వెంటనే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. మే 1 వరకు ఈ హాల్‌టికెట్స్ అందుబాటులో ఉంటాయి.

అభ్యర్థులు హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..eamcet

మే 3, 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్, మే 8, 9 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు విభాగాల వారీగా ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు ఒక విడత, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత పరీక్షలు జరుగనున్నాయి. ఈ ఏడాది ఎంసెట్ పరీక్సలకు మొత్తం 2,16,362 మంది అభ్యర్థులు మాజరుకానున్నారు.

అయితే, ఇప్పటివరకూ ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు రూ.5,000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 24 వరకు రూ. 10,000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.



ఇవి కూడా చదవండి..

SBI Recruitment : SBIలో 2వేల ప్రొబేషనరీ ఆఫీసర్స్ జాబ్స్
First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...