news18-telugu
Updated: May 22, 2020, 8:34 AM IST
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నైట్లెతే వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్ష రాయిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఎవరైనా ఇన్విజిలేటర్లకు పైలక్షణాలు ఉంటే.. వారిని విధుల నుంచి తప్పించి రిజర్వులో ఉన్నవారితో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ వల్ల ఆగిన బీటెక్ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించేందుకు జేఎన్టీయూ-హైదరాబాద్ కసరత్తు చేస్తోంది. బీటెక్ ఫైనల్ ఇయర్ పరీక్షలను జూన్‌లో, ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ పరీక్షలను జూలైలో నిర్వహించనుంది. జూన్ 20 నుంచి 30 వరకు బీటెక్ ఫైనల్ ఇయర్, జూలై 16 నుంచి బీటెక్ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ పరీక్షలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టినట్లు వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. అటు.. ప్రతి ఏటా ప్రైవేటు కాలేజీలకు ఇచ్చే అఫిలియేషన్‌ను తనిఖీలు లేకుండానే ఇవ్వాలని నిర్ణయించనున్నట్లు సమాచారం. భౌతిక తనిఖీలు రద్దు చేసి, ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులు, కాలేజీ యాజమాన్యాలు ఇచ్చే అఫిడవిట్లతోనే 2020-21 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ల ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
May 22, 2020, 8:34 AM IST