JNTU HYDERABAD ALERT FOR STUDENTS KEY CHANGES IN THE SYLLABUS OF ENGINEERING AND PHARMACY COURSES EVK
JNTU Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల సిలబస్‌లో కీలక మార్పులు
(ప్రతీకాత్మక చిత్రం)
JNTU Hyderabad | సాంకేతిక విద్యలో ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ప్రవేశ పెడుతూ మెరుగైన విద్యను అందించడానికి జేఎన్టీయూ ప్రయత్నీస్తోంది. తాజాగా జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఒకే విద్యా సంవత్సరంలో డబుల్ డిగ్రీలు చేసేందుకు అనుమతించాలని బోర్డు ఆఫ్ స్టడీస్(బీవోఎస్) సమావేశం నిర్ణయించింది.
సాంకేతిక విద్య (Technical Education) లో ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ప్రవేశ పెడుతూ మెరుగైన విద్యను అందించడానికి జేఎన్టీయూ ప్రయత్నీస్తోంది. తాజాగా జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఒకే విద్యా సంవత్సరంలో డబుల్ డిగ్రీలు చేసేందుకు అనుమతించాలని బోర్డు ఆఫ్ స్టడీస్(బీవోఎస్) సమావేశం నిర్ణయించింది. డబుల్ డిగ్రీ చేస్తున్నవారికి క్రెడిట్స్‌ను ట్రాన్సఫర్ చేసుకొనే సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. కొత్త విధానంలో ప్రతి సెమిస్టర్‌కు 20 క్రెడిట్స్ కేటాయిస్తున్నట్టు సమాచారం. మార్కెటింగ్, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్, ఫార్మసీ (Pharmacy) కోర్సుల సిలబస్‌లో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. సిలబస్‌లో మార్పులు-చేర్పుల కోసం జేఎన్టీయూ (JNTU) వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులు బీవోఎస్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్నారు.
ఇంటర్నల్‌కు ప్రాధాన్యత..
నూతన సిలబస్ మూడు నుంచి ఐదేండ్ల పాటు అమలులో ఉంటుంది. ఇంటర్నల్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక నుంచి అకడామిక్‌లో 30 శాతం పాఠాలు ఆన్‌లైన్ పద్ధతి (Online System) లో, 70 శాతం పాఠాలు క్లాసురూంలో బోధించాలని నిర్ణయించారు. సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలతో పాటు అఫిలియేటెడ్, అటానమస్ కాలేజీల్లో తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ అకడమిక్ సెనెట్‌లో అమోదం పొందిన వెంటనే సిలబస్ అమలు కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
లాంగ్ ప్రశ్నల తగ్గింపు.. మధ్యలో మానేస్తే డిప్లమా.. జేఎన్టీయూలో ఇకపై జరిగే ప్రతి సెమిస్టర్‌లో లాంగ్ ప్రశ్నల సంఖ్యల సంఖ్య తగ్గింఏ అవకాశం ఉంది. దానితోపాటు షార్ట్ ప్రశ్నల సంఖ్య 20 వరకు పెంచుతారు. ల్యాబ్‌లలో చేసే ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో వెయిటేజీ కల్పిస్తారు. రిసెర్చ్ ప్రాజెక్టులను ఇంజినీరింగ్‌లో 2వ సంవత్సరం, 4వ సంవత్సరంలో తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 4వ సంవత్సరంలో మెయిన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. 40 శాతం మార్కులు ఇంటర్నల్ ప్రాజెక్టు (Internal Projects) లకు.. 60 శాతం మార్కులు సెమిస్టర్ పరీక్షలకు కేటాయించారు.
నాలుగేళ్లో బీటెక్‌ను పూర్తి చేయకుండా రెండేండ్లకే మధ్యలో మానేస్తే డిప్లొమా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని యూనివర్సిటీ భావిస్తోంది. ఏదైనా కారణాల వల్ల బీటెక్ రెండు లేదా మూడేండ్లు చదివిన తరువాత మానేసినా, ఆ తర్వాత మళ్లీ అడ్మిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. రెగ్యులర్ పాఠాలతో పాటు నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.