హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Exams: ఆ యూనివర్సిటీల విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పరీక్షలు రాసే ఛాన్స్.. వివరాలివే

Telangana Exams: ఆ యూనివర్సిటీల విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పరీక్షలు రాసే ఛాన్స్.. వివరాలివే

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా పరీక్షల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని రెండు ప్రముఖ యూనివర్సిటీలు విద్యార్థులకు ఇంటి నుంచే పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా ఎఫెక్ట్ విద్యారంగంపై అధికంగా పడింది. ముఖ్యంగా ఈ విద్యాసంవత్సరం మొత్తం గందరగోళంగా సాగుతోంది. అయితే ఆన్లైన్ విధానంలో క్లాసులు నిర్వహిస్తున్నా.. పరీక్షలు ఎలా నిర్వహించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టెన్త్ ఎగ్జామ్స్ ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే సెకండియర్ లోకి ప్రమోట్ చేసింది సర్కార్. ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేశారు. జూన్ మొదటి వారంలో ఈ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయాల్సి వచ్చింది. టెన్త్ పరీక్షలను కూడా వాయిదా చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కొందరు పేరెంట్స్, స్టూడెంట్స్ కోర్టుకు సైతం వెళ్లారు. ఈ అంశంపై ప్రస్తుతం కోర్టులో విచారణ సైతం సాగుతోంది.

APSSDC Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ప్రముఖ కంపెనీలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు మరో రెండు రోజులే ఛాన్స్

AP Tenth Exams: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన.. వివరాలివే

అయితే.. ఇంటర్ సెకండియర్, బీటెక్, డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు సకాలంలో నిర్వహించి, ఫలితాలను వెల్లడించకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంటర్ విద్యార్థులు పై చదువులకు, బీటెక్, ఇతర డిగ్రీ విద్యార్థులు ఉద్యోగాలు, విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్లడం తదితర అంశాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా విద్యార్థులకు ఎలాగైనా పరీక్షలు నిర్వహించడం మేలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్(JNTUH) అధికారులు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి సెమిస్టెర్(8వ సెమిస్టర్) పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని భావిస్తున్నారు.

గతేడాది సమీపంలోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసే అవకాశాన్ని యూనివర్సిటీ విద్యార్థులకు కల్పించింది. అయితే కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం అంత మంచిది కాదన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్నాలజీని ఉపయోగించుకుని ఆన్లైన్లోనే ఇంటి వద్ద నుంచి పరీక్షలు రాసే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలని అధికారులు యోచిస్తున్నారని తెలుస్తోంది. జూన్, జూలై నెలలో ఈ అంశంపై అధికారులు తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

జయశంకర్ యూనివర్సిటీ సైతం..

కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఇంటి నుంచే పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించాలని జయశంకర్ వ్యవసాయ విశ్యవిద్యాలయం సైతం యోచిస్తోంది. తమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరికీ ఈ అవకాశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్నంత సేపు వారి సెల్ ఫోన్లలో కెమెరా ద్వారా యూనివర్సిటీ పర్యవేక్షిస్తూ ఉంటుంది. విద్యార్థులు కాపీ కొట్టకుండా కూడా సాంకేతికతను ఉపయోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానంపై మరి కొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.

First published:

Tags: Corona, Exams, JNTUH, Online Education, Telangana

ఉత్తమ కథలు